
- కరెంట్ షాక్తో మృతి చెందిన ఐదుగురికి సంఘీభావం
ఉప్పల్, వెలుగు: రామంతాపూర్ గోఖలే నగర్లో శ్రీకృష్ణ జన్మాష్టమి ఊరేగింపులో విద్యుత్ షాక్తో మృతి చెందిన ఐదుగురికి సంఘీభావంగా యాదవ సంఘాల ఆధ్వర్యంలో రామంతపూర్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుంచి గోఖలే నగర్ వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, మాజీ ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, యాదవ, బీసీ సంఘాలు పాల్గొని నివాళులర్పించారు.
విద్యుత్ శాఖ, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని, మృతుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యుత్ శాఖ వద్ద ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు.