ఎక్కువ వడ్డీ ఇస్తున్న కొన్ని బ్యాంకులు

ఎక్కువ వడ్డీ ఇస్తున్న కొన్ని బ్యాంకులు

బిజినెస్ డెస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: దేశంలో వడ్డీ రేట్లు భారీగా పెరిగాయి.  గత ఏడు నెలల్లోనే రెపో రేటు 2.25 % ఎగిసింది. ఈ ఏడాది మే నెలలో ఏడాది టెన్యూర్ ఉన్న ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీలపై 5.1– 5.2%  వడ్డీని ఆఫర్ చేసిన  ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ,  ఈ నెల 14 నాటికి ఇదే కాలపరిమితి కలిగిన ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీలపై 6.75% వడ్డీని ఇస్తోంది.  స్మాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనాన్స్ బ్యాంకులయితే ఫిక్స్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిపాజిట్లపై 9.26% వరకు వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. సరియైన బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎంచుకుంటే సేఫ్టీతో పాటు మంచి రిటర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీ ఇన్వెస్టర్లు పొందొచ్చు. కొత్తగా ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీలు చేయాలనుకునే వారిలో ఎటువంటి గందరగోళం లేదు. కానీ, ఇప్పటికే ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీలు కొనసాగిస్తున్న ఇన్వెస్టర్లు ప్రస్తుత పరిస్థితులను ఎలా క్యాష్ చేసుకోగలరనేదే ముఖ్యం. తక్కువ వడ్డీ రేట్లు ఉన్నప్పుడు ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీ చేసిన వారు, ప్రస్తుతం తమ ఫిక్స్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిపాజిట్లను ప్రీమెచ్యూర్ క్లోజర్ (మెచ్యూర్ కాకముందే విత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రా) చేయాలనుకునే ఆలోచనలో కూడా ఉన్నారు.  ఇందుకు కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. పాత ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీ మెచ్యూర్ అవ్వడానికి ఇంకా ఎంత టైమ్ ఉంది? అదనంగా వడ్డీ ఇచ్చే ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీ ఆప్షన్లు ఏమైనా ఉన్నాయా? ప్రీక్లోజర్ చేయడానికి  ఎంత ఖర్చవుతుంది? అనే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని స్క్రిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాక్స్ సీబీఓ అనూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బన్సాల్ అన్నారు.  ‘ఇప్పటికే ఉన్న ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీలను క్లోజ్ చేసే ముందు  ఈ డిపాజిట్లు మెచ్యూర్ అవ్వడానికి ఇంకా ఎంత టైమ్ మిగిలి ఉందనేది చూసుకోవాలి. ఉదా. ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీ ఇంకో 6 నెలల్లో మెచ్యూర్ అయితే ప్రీక్లోజర్ చేయాల్సిన అవసరం లేదు’ అని ఆనంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాతి వెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్ అన్నారు. ఇప్పటికే ఉన్న ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీ మెచ్యూర్ అవ్వడానికి ఏడాది కంటే తక్కువ టైమ్ ఉంటే ఈ డిపాజిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను హోల్డ్ చేయడం బెటర్ అని సలహాయిచ్చారు.  

ప్రీక్లోజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఛార్జీ..

ప్రీక్లోజర్ చేయడం వలన తక్కువ వడ్డీ రావడమే కాకుండా, బ్యాంకులు ప్రీక్లోజర్ ఛార్జీలను కూడా వేస్తాయి. చాలా బ్యాంకులు ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీల విత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రాలపై 0.5 %–1 % వరకు పెనాల్టీ వేస్తున్నాయి.  ఉదా.  ఒక ఇన్వెస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  రూ. లక్షను  5.3 % వడ్డీ రేటు వద్ద  మూడేళ్లకుగాను ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీ చేశాడని అనుకుందాం. ఏడాది తర్వాత విత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రా చేస్తే వడ్డీ సుమారు 4.6 శాతమే వస్తుంది. ఇందులో ప్రీక్లోజర్ ఛార్జీల కింద 0.50 శాతం పోతుంది. చివరికి రూ.లక్ష  ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీపైన ఏడాదికి 4.1% వడ్డీనే మిగులుతుంది. 

రీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీ చేస్తే లాభం లేదా!

పాత ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీ టెన్యూర్ రెండేళ్ల కంటే పైనే ఉంటే  ఫిక్స్డ్ డిపాజిట్లను విత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రా చేసి మళ్లీ ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీ చేయడం వలన లాభం ఉంటుందని ఎనలిస్టులు చెబుతున్నారు. పైన పేర్కొన్న ఉదాహరణనే తీసుకుంటే  పాత ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీలో 5.3 శాతం వడ్డీని బ్యాంకులు ఆఫర్ చేశాయి. తాజాగా అదే టెన్యూర్ కలిగిన ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీలపై 6.75 శాతం ఇస్తున్నాయని అనుకుందాం. పాత ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీని క్లోజ్ చేయడం వలన వడ్డీ కింద రూ.4,163  వస్తుంది. దీంతో మొత్తం ప్రిన్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూ.1,04,163 కు చేరుకుంటుంది. మిగిలిన రెండేళ్లకు 6.75 శాతం దగ్గర  ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీ చేయడంతో రూ.14,921 వడ్డీ వస్తుంది. మొదటి ఏడాది వచ్చిన రూ.4,163 ను కూడా కలుపుకుంటే మూడేళ్లలో మొత్తం వడ్డీ  రూ.19,085 అవుతుంది. అదే  పాత ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీనే 5.30 శాతం దగ్గర మెచ్యూరిటీ వరకు ఉంచితే రూ.17,111 మాత్రమే వచ్చేది. పెరిగిన ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీ రేటు పాత ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీపై ప్రీక్లోజర్ ఛార్జీలు లేదా తగ్గిన వడ్డీ కాస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను భర్తీ చేసి,  నెట్ ప్రాఫిట్ ఇచ్చేలా ఉండాలని ఎనలిస్టులు సలహాయిస్తున్నారు. ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీల  ద్వారా వచ్చే వడ్డీ ఆదాయంపై ట్యాక్స్ కూడా పడుతుంది. అందువలన దీన్ని కూడా పరిగణనలోకి తీసుకొని ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీ చేసుకోవాలి.