కారు వాడేందుకు కొన్ని గాడ్జెట్స్‌‌

కారు వాడేందుకు కొన్ని గాడ్జెట్స్‌‌

కారు కొనగానే సరిపోదు.. అందులో వాడేందుకు కొన్ని గాడ్జెట్స్‌‌ కూడా కొంటేనే షికారు హాయిగా సాగుతుంది. ఈ గాడ్జెట్స్ ఉంటే చాలా టైంని సేవ్‌‌ చేసుకోవచ్చు. డ్యాష్‌‌ క్యామ్‌‌, జంప్‌‌ స్టార్టర్‌‌‌‌ లాంటివి వాడితే జర్నీ మరింత సాఫీగా ఉంటుంది. అలాంటి కారు గాడ్జెట్స్‌‌ కొన్ని.. 

జంప్‌‌ స్టార్టర్‌‌‌‌

చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా కార్లకు స్టార్టింగ్‌‌ ప్రాబ్లం వస్తుంటుంది. వాతావరణం బాగా చల్లగా ఉండడం వల్ల బ్యాటరీ సరిగ్గా పనిచేయక ఇలాంటి ప్రాబ్లమ్స్‌‌ వస్తుంటాయి. అలాంటప్పుడు కారును తోసి స్టార్ట్‌‌ చేయాల్సి వస్తుంది. కానీ.. అందుబాటులో ఎవరూ లేనప్పుడు ఇలాంటి సమస్య వస్తే?... అందుకే ‘నాకో’ కంపెనీ బూస్ట్‌‌ ప్లస్‌‌ జీబీ40 అనే గాడ్జెట్‌‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది కార్‌‌‌‌కి జంప్‌‌ స్టార్టర్‌‌‌‌గా పనిచేస్తుంది. ఇందులో 1000ఏఎంపీ బ్యాటరీ ఉంటుంది. కార్‌‌‌‌ స్టార్ట్‌‌ కానప్పుడు, బ్యాటరీకి దీన్ని కనెక్ట్‌‌ చేస్తే చాలు. వెంటనే జంప్‌‌ స్టార్ట్ అవుతుంది. దీనికి ఎల్‌‌ఈడీ ఫ్లాష్ లైట్‌‌ కూడా ఉంటుంది. ఇది స్పార్క్ ప్రూఫ్‌‌తో వస్తుంది. 6 లీటర్ల గ్యాసోలిన్ ఇంజిన్‌‌లకు, 3 లీటర్ల డీజిల్ ఇంజిన్‌‌ల వరకు ఇది సపోర్ట్ చేస్తుంది. పడవలు, లాన్ మూవర్స్‌‌కి కూడా దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. మొబైల్‌‌ని ఛార్జ్‌‌ చేసుకోవచ్చు. 

ధర: 14,500 రూపాయలు

వాక్యూమ్‌‌ క్లీనర్‌‌‌‌

ఇంట్లో చెత్త పడితే ఈజీగా క్లీన్‌‌ చేసుకోవచ్చు. కానీ.. కార్‌‌‌‌లో చెత్త పడినప్పుడు క్లీన్‌‌ చేయాలంటే చాలా చిరాకు అనిపిస్తుంది. అందుకే కారు క్లీనింగ్ కోసం ప్రత్యేకంగా హ్యాండ్‌‌హెల్డ్ వాక్యూమ్‌‌ క్లీనర్లు అందుబాటులో ఉన్నాయి. వీటితో కారులోని ప్రతి మూలలో క్లీన్‌‌ చేయొచ్చు. చిన్న చిన్న కాగితపు ముక్కలు, ధూళి, ఇసుక లాంటి వాటిని ఈజీగా  వాక్యూమ్‌‌ చేస్తాయి. వీటిని కారులోనే ఛార్జ్‌‌ చేసుకోవచ్చు. బరువు కూడా చాలా తక్కువ ఉంటుంది. 

ధర: ఫీచర్లను బట్టి 1,000 రూపాయల నుంచి మొదలు 

డ్యాష్‌‌ కెమెరా

ఎంత ఎక్స్‌‌పీరియెన్స్‌‌డ్‌‌ డ్రైవర్ అయినా కొన్నిసార్లు యాక్సిడెంట్స్ అవుతుంటాయి. కార్‌‌‌‌ డ్యాష్ కెమెరాలు వాడితే అలాంటివి జరగకుండా జాగ్రత్త పడొచ్చు. ఇవి రకరకాల మోడళ్లు, సైజులు, ఫీచర్లతో మార్కెట్‌‌లో అందుబాటులో ఉన్నాయి. యాక్సిడెంట్స్‌‌ జరిగినప్పుడు ఎవిడెన్స్‌‌గా కూడా ఉంటాయి. కారు ఫ్రంట్, బ్యాక్‌‌ గ్లాస్‌‌లకు వీటిని స్టిక్‌‌ చేసుకోవచ్చు.  ముఖ్యంగా రాత్రి టైంలో ఇవి బాగా ఉపయోగపడతాయి. ఈ డ్యాష్‌‌ కెమెరా సెటప్‌‌లో ఉన్న డిస్‌‌ప్లేలో వెనక నుంచి వచ్చే వెహికల్స్‌‌ని ముందుగానే గుర్తించవచ్చు. అంతేకాదు.. ఈ కెమెరాలు యాక్సిడెంట్స్‌‌ జరిగినప్పుడు ఆటోమెటిక్‌‌గా వీడియో ఫుటేజీని రికార్డ్ చేస్తాయి. 

ధర: ఫీచర్లను బట్టి 3,500 రూపాయల నుంచి మొదలు 

టాబ్లెట్‌‌ హోల్డర్‌‌‌‌ 

కారు జర్నీ బోర్‌‌‌‌ కొట్టకుండా ఉండేందుకు చాలామంది సినిమాలు, వీడియోలు చూస్తుంటారు. ముందు కూర్చున్న వాళ్లకు టాబ్లెట్‌‌ పెట్టుకోవడానికి హోల్డర్ ఉంటుంది. కానీ.. వెనక సీట్లలో కూర్చున్నవాళ్లకే కాస్త ఇబ్బంది. అందుకే కొన్ని హెడ్‌‌రెస్ట్‌‌ హోల్డర్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఇవి రకరకాల మోడళ్లలో దొరుకుతున్నాయి. ముందు దీన్ని సీటుకు ఉన్న హెడ్‌‌ రెస్ట్‌‌కు పెట్టి, అందులో మొబైల్‌‌ లేదా టాబ్లెట్‌‌ పెట్టి సినిమాలు చూడొచ్చు. కొన్ని సిలికాన్ హోల్డింగ్ నెట్‌‌తో కూడా వస్తున్నాయి. ఇది టాబ్లెట్లు, ఫోన్లకు గీతలు పడకుండా కాపాడుతుంది. 

ధర: క్వాలిటీ, డిజైన్‌‌ని బట్టి 500 రూపాయల నుంచి మొదలు