
పౌరసత్వ సవరణ బిల్లుపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు ప్రధాని మోడీ. కొన్ని పార్టీలు తప్పుడు హామీలు ఇస్తూ, ప్రజలను మోసగిస్తున్నాయని, తాము మాత్రం ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని ఆయన అన్నారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఆదివారం నాడు నిర్వహించిన భారీ ర్యాలీలో మోడీ మాట్లాడారు.
పౌరసత్వ బిల్లుపై ఆప్ తప్పుడు ప్రచారం చేస్తోందని అక్కడ జరిగిన సభలో మోడీ అన్నారు. తప్పుడు వీడియోలు తెచ్చిన పాపానికి ఆ పార్టీని ప్రజలే శిక్షించాలని, తప్పుడు ప్రచారాలు సాగిస్తున్న పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని ప్రధాని అన్నారు. ఈ ర్యాలీలో మోడీతో పాటు పలువురు బీజేపీ నేతలు విజయ్ గోయెల్, మనోజ్ తివారీ, ప్రకాష్ జవదేకర్, గౌతమ్ గంభీర్‌లు పాల్గొన్నారు.