ఇంటి ముందు కారుకు నిప్పు : అర్ధరాత్రి పోకిరీల ఆగడాలు

ఇంటి ముందు కారుకు నిప్పు : అర్ధరాత్రి పోకిరీల ఆగడాలు

హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో పోకిరీలు రెచ్చిపోయారు. కమలా నగర్ లో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత.. ఓ ఇంటిముందు పార్క్ చేసి ఉంచిన కారుకు నిప్పుపెట్టారు.

పోకిరీల ఆగడాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. రాత్రి 2 గంటల తర్వాత… ఓ బైక్ పై ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఒకడు బైక్ పైనే ఉన్నాడు. మరొకడు.. కారు దగ్గరకు వచ్చి.. దానికి నిప్పు పెట్టాడు. మంటలు అంటుకునేంతవరకు అక్కడే ఉన్నారు. ఇంతలోనే రెండు బైక్ లపై మరో ఇద్దరు అక్కడకు వచ్చారు. కొద్దిసేపు అటూ ఇటూ తిరిగి.. కారు మంటలు పెద్దగవుతున్న సమయంలో అక్కడినుంచి పారిపోయారు.

కారుకు మంటలు అంటుకోవడం స్థానికులు గమనించారు. వెంటనే నీళ్లతో మంటలు ఆర్పేశారు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.