ఆగస్టు 21 నుంచి 27 వరకు ఈ రూట్లలో పలు రైళ్లు రద్దు..

ఆగస్టు 21 నుంచి 27 వరకు ఈ రూట్లలో పలు రైళ్లు రద్దు..

ఆగస్టు 21 వరకు పలు రైళ్లు రద్దయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు 21 నుంచి పలు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు.  విజయవాడ డివిజన్‌లో భద్రతా నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఆగస్టు 21 నుంచి 27వ తేదీ వరకు కాకినాడ- విశాఖ (17247), విశాఖ- కాకినాడ (17268), రాజమండ్రి- విశాఖ (07466), విశాఖ- రాజమండ్రి (07467) పాసింజర్‌ రైళ్లను రద్దు చేసినట్టు వెల్లడించారు. 

విజయవాడ డివిజన్‌లోని గుణదల -విజయవాడ, విజయవాడ నార్త్‌ ఈస్ట్‌ క్యాబిన్‌ మధ్య మూడో లైనుకు సంబంధించి ప్రీ-నాన్‌ ఇంటర్‌ లాకింగ్‌ ట్రాఫిక్‌, పవర్‌ బ్లాక్‌ పనుల జరుగుతున్నాయని. వీటి  కారణంగా ఈ  జిల్లా మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఆగస్టు 21, 22వ తేదీల్లో ఎర్నాకులం -పాట్నా ఎక్స్‌ప్రెస్‌ (22643),  23, 24 తేదీల్లో బెంగళూరు గౌహటి ఎక్స్‌ప్రెస్‌ (12509), 27న కొయంబత్తూర్‌- సిలిచర్‌ ఎక్స్‌ప్రెస్‌(12515) రైళ్లు వయా నిడదోవలు, భీమవరం టౌన్‌, గుడివాడ, విజయవాడ మీదుగా మళ్లింపు మార్గంలో నడుస్తాయని పేర్కొన్నారు.