రోడ్డుపై రయ్​రయ్​ మంటూ శబ్దాలు

రోడ్డుపై రయ్​రయ్​ మంటూ శబ్దాలు

రోడ్లు కూడా రాగాలు పలికించగలవు. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే ఈ మ్యూజికల్ రోడ్స్ గురించి తెలుసుకోవాల్సిందే..రోడ్డుపై వాహనాలు వెళ్లేటప్పుడు రయ్​రయ్​ మంటూ శబ్దాలు వినిపిస్తాయి. ఈ శబ్దాలు లయబద్ధంగా ఉంటే ఎలా ఉంటుంది? ఈ ఐడియాతో పుట్టినవే మ్యూజికల్ రోడ్స్. ఈ రోడ్స్‌‌‌‌పై కారు వెళ్లేటప్పుడు రయ్యిమనే శబ్దంతోపాటు కొన్ని రాగాలు, వైబ్రేషన్స్ వినిపిస్తాయి. ఈ రోడ్లు చాలాదేశాల్లో పాపులర్.

మ్యూజికల్ రోడ్లను త్రికోణాకారంలో ఉండే అల్యూమినియం చువ్వలతో తయారు చేస్తారు. అల్యూమినియం చువ్వలను గిటార్‌‌‌‌‌‌‌‌లోని తీగల మాదిరిగా రోడ్డుపై లయబద్ధంగా అమర్చి, వాటిపై పల్చగా తారు పోస్తారు. దానిపై ఒక వేగంతో వెళ్లినప్పుడు సంగీతం వినిపిస్తుంది. జాతీయ రోడ్లపై వేగాన్ని కంట్రోల్ చేసేందుకు డెన్మార్క్‌‌‌‌ ప్రభుత్వం 1995లో ఈ కాన్సెప్ట్‌‌‌‌ తీసుకొచ్చింది. రోడ్డుపై గంటకు 45 మైళ్ల వేగంతో వెళ్లినప్పుడు  మ్యూజికల్ నోట్స్ వినిపించేలా రోడ్స్ డెవలప్ చేసింది. ఈ మోడల్ సక్సెస్ కావడంతో తర్వాత చాలాదేశాలు ఇలాంటి రోడ్స్‌‌‌‌ ఏర్పాటుచేశాయి. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న  సివిక్‌‌‌‌ మ్యూజికల్‌‌‌‌ రోడ్డు, జపాన్‌‌‌‌లో ఉన్న మెలోడి రోడ్డు, దక్షిణ కొరియాలోని సింగింగ్‌‌‌‌ రోడ్డు ఈ కోవకే చెందుతాయి.