గిఫ్ట్​ ఇస్తే గుర్తుండిపోవాలి!

గిఫ్ట్​ ఇస్తే గుర్తుండిపోవాలి!

ఎవరికైనా గిఫ్ట్​ ఇస్తే గుర్తుండిపోవాలి అనుకుంటారు ఎవరైనా. అందుకోసం ప్రత్యేకంగా గిఫ్ట్​లు తయారుచేయిస్తుంటారు. అలాగే మనదేశ ప్రధాని మోడీ కూడా.. ఇతర దేశాల వాళ్లకు ఇచ్చే గిఫ్ట్​లు కూడా చాలా స్పెషల్​గా ఉంటాయి. వాటి గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే! 

మొన్నామధ్య జపాన్ ప్రభుత్వ అధిపతిగా తన మొదటి భారత పర్యటన కోసం కిషిదా మనదేశ రాజధాని ఢిల్లీకి వచ్చారు. అయితే ఆ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, జపాన్ పీఏం ఫుమియో కిషిదకి ఒక గిఫ్ట్ ఇచ్చారు. అది అలాంటిలాంటి గిఫ్ట్​ కాదు. చాలా స్పెషల్. దానిపేరు ‘కృష్ణ పంఖి’ (విసనకర్ర). విసనకర్ర  చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. దాన్ని రాజస్తాన్​లో తయారుచేశారు. పూర్తిగా గంధపు చెక్క​తో అద్భుతంగా డిజైన్ చేశారు. అంతేకాదు, ఆ విసనకర్రకి కిటికీ కూడా ఉంది. కిటికీ తలుపు తెరిస్తే, కృష్ణుడి బొమ్మలు కనిపిస్తాయి. అవి కృష్ణుడి ప్రేమ, సున్నితత్వం, కరుణ వంటి ఎక్స్​ప్రెషన్స్ ఉన్న రకరకాల పోజ్​లలో ఉంటాయి. ఈ వినసకర్రకి చివర మువ్వలు ఉన్నాయి. విసనకర్ర పై భాగంలో నెమలి బొమ్మ ఉంది. విసనకర్రని నిలబెట్టడానికి కింద స్టాండ్ కూడా ఉంది. రాజస్తాన్​లోని ‘చురు’ కళాకారులు ‘జలి’ అనే ట్రెడిషనల్ డిజైన్​తో దీన్ని తయారుచేశారు. దీన్ని గంధపు చెక్కతో ఎందుకు తయారుచేశారంటే, ఎన్నో మెడిసినల్ వ్యాల్యూస్ ఉన్నాయి కనుకనే. అంతేకాకుండా దానికి మతపరమైన గుర్తింపు ఉంది కాబట్టి. 

గతంలో కూడా...

గతంలో కూడా అమెరికా వైస్​ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్​కి వెరైటీ గిఫ్ట్​ ఇచ్చారు. కమలా గ్రాండ్​ ఫాదర్​కి సంబంధించిన కొన్ని పేపర్ కటింగ్స్​ని చెక్కతో ఫ్రేమ్ కట్టించి, ఇచ్చారు. అదేకాకుండా, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్​కి ‘గులాబీ మీనాకారి’ గిఫ్ట్​గా ఇచ్చారు. అది పూర్తిగాసిల్వర్​తో తయారుచేసింది. అందులో కాశీ సౌందర్యం కనిపిస్తుంటుంది. అది చూడ్డానికి నెమలి ఆకారంలో ఉన్న షిప్​లా కనిపిస్తుంది. ఇకపోతే జపాన్ మాజీ సౌందర్యం సుగాకి గంధపు చెక్కతో చేసిన బుద్ధుడి విగ్రహం గిఫ్ట్​గా ఇచ్చారు. అలాగే.. ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ నెతన్యాహుకి కేరళ నుంచి తెప్పించిన రెండు జతల కాపర్ ప్లేట్​లు గిఫ్ట్​గా ఇచ్చారు. డొనాల్డ్ ట్రంప్​ ప్రెసిడెంట్​గా ఉన్నప్పుడు, హిమాచలి సిల్వర్ బ్రేస్​లేట్, టీ, తేనె, చేత్తో కుట్టిన శాలువాలు గిఫ్ట్​గా ఇచ్చారు. ఇలా మనదేశ ప్రధాని ఇతర దేశ నాయకులకు ఇచ్చే గిఫ్ట్​లు కూడా చాలా చాలా స్పెషల్.