తల్లిని కొట్టి చంపిన కొడుకు .. నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలంలో ఘటన

తల్లిని కొట్టి చంపిన కొడుకు .. నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలంలో ఘటన

మద్దూరు, వెలుగు: కన్న తల్లిని కొడుకు రాయితో తలపై బాది పారతో కొట్టి చంపిన ఘటన నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం గోకుల్ నగర్ లో జరిగింది. ఎస్సై విజయ్ కుమార్  తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చాకలి భీమమ్మ(58)కు భర్తతో పాటు ఐదుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. చిన్న కొడుకు రామకృష్ణ సైకోగా ప్రవర్తిస్తూ వెళ్లిపోగా, కుటుంబ సభ్యులు తీసుకువచ్చి తల్లిదండ్రుల వద్ద ఉంచారు.

 ఈక్రమంలో పింఛన్  డబ్బులు అడిగితే తనను తల్లి తిట్టిందనే కోపంతో రామకృష్ణ ఆదివారం రాత్రి నిద్రపోతున్న భీమమ్మను రాయితో తలపై బాది హత్య చేశాడు. సోమవారం ఉదయం రెండో కొడుకు గోపాల్  రక్తం మడుగులో పడి ఉన్న తల్లిని చూసి షాక్  అయ్యాడు. తమ్ముడిపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు వచ్చి విచారించారు. తనను తిట్టినందుకే చంపానని ఒప్పుకున్నట్లు తెలిసింది.