మామను బండరాయితో కొట్టి చంపిన అల్లుడు

మామను బండరాయితో కొట్టి చంపిన అల్లుడు

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. కుటుంబ తగాదాలతో సొంత మామను బండరాయితో కొట్టి చంపాడో అల్లుడు. పొలం అమ్మకుండా మామ అడ్డుకుంటున్నాడని హత్య చేసినట్టు తెలుస్తోంది. మృతుడు సంగారెడ్డికి చెందిన ఆగమయ్యగా గుర్తించారు. అల్లుడు యాదగిరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం ఆగమయ్య పత్తి చేనులో పనిచేస్తుండగా... నిందితుడు హత్య చేసినట్టు స్థానికులు చెప్తున్నారు.