
వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. పరిగి మండలం కదావన్ పూర్ లో కన్నతల్లిని హత్య చేశాడు కొడుకు. తల్లి భీమమ్మ మెడకు కరెంట్ వైరు బిగించి హత్య చేశాడు బలవంత్. తర్వాత తల్లిని ఎవరో చంపారంటూ స్థానికులను నమ్మించే ప్రయత్నం చేశాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బలవంత్ మద్యం సేవించి, జులాయిగా తిరుగుతూ రైతు బంధు, వితంతు పెన్షన్ కోసం తల్లితో గొడవ పడే వాడని స్థానికులు తెలిపారు. తాగుడు, గొడవల వల్ల భర్తను వదిలేసి దూరంగా ఉంటున్నారు భార్య పిల్లలు. తల్లి చనిపోతే రైతు బీమా డబ్బులు వస్తాయ అని చంపాడు.