నా కొడుకులు అన్నం పెట్టట్లేదు..రోజూ కొడుతున్నరు.. ఆర్డీవో దగ్గర కన్నీళ్లు పెట్టుకున్నతల్లి

నా కొడుకులు అన్నం పెట్టట్లేదు..రోజూ కొడుతున్నరు.. ఆర్డీవో దగ్గర కన్నీళ్లు పెట్టుకున్నతల్లి

ఆస్తి కోసం తండ్రిని చంపిన కొడుకు... ఆస్తిని తీసుకొని తల్లిదండ్రులను నిర్లక్షం చేస్తున్న  కన్నబిడ్డలు. రోజూ ఇలాంటి ఘటనలు ఏదో ఒక చోట  జరుగుతూనే ఉన్నాయి. తల్లిదండ్రుల ఆస్తులు గుంజుకుని అన్నం పెట్టకుండా ఇంటి నుంచి గెంటివేస్తున్నారు కొడుకులు.  తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది.. ఉన్న భూమిని లాక్కొని తనకు కూడు పెట్డడం లేదని ఓ తల్లి  ఆర్డీవో దగ్గర మొరపెట్టకుంది. 

వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ జిల్లా దారూర్ మండలం నాగారం గ్రామానికి చెందిన వృద్ధురాలు గౌషియా.. తన కోడుకులు ఆస్తిని, డబ్బును  తీసుకుని అన్నం పెట్టకుండా రోజు కొడుతున్నారని తనకు న్యాయం చెయ్యలని వికారాబాద్ ఆర్డీవో వాసుచంద్రాను కలిసి తన గోడు చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకుంది. పెద్ద కొడుకు మహమ్మద్ తనను చిత్రహింసలు పెడుతున్నాడని,అన్నం పెట్టకుండా దుర్భాషలాడుతూ  కొడుతున్నాడని తనకు న్యాయం చెయ్యాలని కోరింది.

ALSO READ : మైలార్ దేవ్ పల్లిలో రోడ్డుపై తగలబడ్డ స్కూల్ బస్సు..

దీనిపై స్పందించిన ఆర్డీవో వాసుచంద్రా.. గౌషియా బేగం కొడుకులు ఇద్దరికి నోటీసులు ఇచ్చి సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం వృద్ధురాలికి  న్యాయం చేస్తామని హమీ ఇచ్చారు. కన్నకొడుకులే తన పాలిట యముళ్ళు అయ్యారని ఆర్డీవో కార్యాలయానికి వచ్చే వాళ్ళు కూడ గౌషియా బేగం పరిస్థితిని చూసి అయ్యో పాపం అని బాధపడుతున్నారు.