ఈరోజుల్లో ప్రేమ పెళ్లి కామన్. కులాలు, మతాలు వేరు అయినా.. ఒకర్ని ఒకరు ఇష్టపడితే.. ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం... ప్రస్తుతం ఎక్కడ చూసిన సర్వసాధారణం అయిపోయింది. అయితే కొందరు పెద్దలు మాత్రం తమ పిల్లలు చేసుకున్న ప్రేమ వివాహాల్ని అంగీకరించలేకపోతున్నారు. కొందరు పేరంట్స్ అయితే తమ కన్నబిడ్డలని కూడా చూడకుండా ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి ఇంట్లోకి కూడా రానివ్వడం లేదు. తాజాగా ఇలాంటి ఘటనే.. ఖమ్మం జిల్లాలో జరిగింది. ప్రేమ పెళ్లి చేసుకున్న తనను తల్లిదండ్రులు ఇంట్లోకి రానివ్వడం లేదంటూ ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఓ యవకుడు ఆందోళనకు దిగారు.
తల్లిదండ్రులు తనను ఇంట్లోకి రానివ్వాలంటూ.. ఇంటిపైకి ఎక్కి నిరసనకు దిగాడు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని సూసైడ్ చేసుకుంటానంటూ హల్చల్ చేశాడు. గాంధీనగర్ కు చెందిన రామకృష్ట అనే యువకుడు ఇటీవలే ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే తమ అంగీకారం లేకుండా పెళ్లి చేసుకున్నాడని.. తల్లిదండ్రులు అతడిని ఇంట్లోకి రానివ్వడం లేదు. దీంతో తనను ఇంట్లోకి రానివ్వాలని.. లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని రామకృష్ణ బెదిరింపులకు దిగాడు. చివరకు ఇరుగుపొరుగు వారు వచ్చి యువకుడికి నచ్చజెప్పి కిందకు తీసుకొచ్చారు.
