తల్లిని చంపిన కొడుకుకు జీవితఖైదు ..సిద్దిపేట డిస్ట్రిక్ ఫస్ట్ అడిషనల్ సెషన్స్ కోర్టు తీర్పు

తల్లిని చంపిన కొడుకుకు జీవితఖైదు ..సిద్దిపేట డిస్ట్రిక్ ఫస్ట్ అడిషనల్ సెషన్స్ కోర్టు తీర్పు

సిద్దిపేట రూరల్, వెలుగు: తల్లిని చంపిన కేసులో కొడుకుతో పాటు అతని ఫ్రెండ్ కు జీవితఖైదు, రూ. 22 వేల జరిమానా విధిస్తూ సిద్దిపేట డిస్ట్రిక్ ఫస్ట్ అడిషనల్ సెషన్స్ కోర్టు జడ్జి జయప్రసాద్ బుధవారం తీర్పు ఇచ్చారు. సిద్దిపేట సీపీ ఎస్ఎం విజయ్ కుమార్ తెలిపిన మేరకు..  2023, ఆగస్టులో ములుగు మండలం బండ మైలారం గ్రామానికి చెందిన మిరియాల వెంకటమ్మను హత్య చేసి కాళ్ల కడియాలు ఎత్తుకెళ్లారు.

 మృతురాలి కూతురు శైలజ ఫిర్యాదుతో వెంకటమ్మ కొడుకు ఈశ్వర్, అతని ఫ్రెండ్ కొత్తూరుకు చెందిన పర్వతం రామును పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తు అనంతరం చార్జ్ షీట్ కోర్టులో దాఖలు చేయగా.. జడ్జి తీర్పు చెప్పారు. నిందితులకు శిక్ష పడేలా వ్యవహరించిన పోలీసు అధికారులను సీపీ అభినందించారు.