యువకుల బలిదానాలు చూసే సోనియా తెలంగాణ ఇచ్చారు : మీరాకుమార్

యువకుల బలిదానాలు చూసే సోనియా తెలంగాణ ఇచ్చారు : మీరాకుమార్

యువకుల బలిదానాలు చూసే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని మాజీ లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ అన్నారు.  గన్ పార్క్ వద్ద అమరులకు  నివాళులు అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.  రాష్ట్ర ప్రజలకు అవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.  

కాంగ్రెస్ వల్లే తెలంగాణ సాకారం అయిందని చెప్పిన మీరాకుమార్ ... ఎందరో త్యాగాల ఫలితంగా తెలంగాణ వచ్చిందని అన్నారు.  రాష్ట్రంలో దొరల పాలన కొనసాగుతుందని.. సర్కార్ మారలన్నారు.  

గాంధీభవన్ లో జరిగే  రాష్ట్ర అవిర్భావ వేడుకలకు హాజరు అయ్యేందుకు మీరాకుమార్ 2023 జూన్ 01 గురువారం  రోజున హైదరాబాద్ కు వచ్చారు.  శంషాబాద్ ఎయిర్​పోర్టులో ఆమెకు ఏఐసీసీ కార్యరద్శి నదీమ్​జావెద్, ప్రొటోకాల్ కమిటీ చైర్మన్​ హర్కర వేణుగోపాల్ తదితరులు స్వాగతం పలికారు.