ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన సోనియా

ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన సోనియా

కొవిడ్ లక్షణాలతో ఢిల్లీలోని సర్ గంగారామ్  ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సోమవారం సాయంత్రం డిశ్చార్జి అయ్యారు. ఇంటి వద్ద విశ్రాంతి తీసుకోవాలని ఆమెకు వైద్యులు సూచించారు. జూన్ 2న సోనియాకు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో మెరుగైన చికిత్స నిమిత్తం గత వారమే ఆస్పత్రిలో చేరారు. ‘నేషనల్ హెరాల్డ్’ మనీలాండరింగ్ కేసులో జూన్ 23న ఆమె ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాల్సి ఉంది.  కాగా, ఆస్పత్రి నుంచి సోనియా గాంధీ డిశ్చార్జి అయిన విషయాన్నికాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జైరాం రమేశ్ ట్విటర్ వేదికగా ప్రకటించారు.