ప్రక్షాళన ప్రారంభించిన కాంగ్రెస్ హైకమాండ్

ప్రక్షాళన ప్రారంభించిన కాంగ్రెస్ హైకమాండ్

గత వారం వచ్చిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆయా పార్టీలపై భారీ ప్రభావాన్ని చూపాయి. ఆ ఐదు రాష్ట్రాలలో ఎక్కడా కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని చాటుకోలేకపోయింది. అంతర్గత కుమ్ములాటలతో అధికారంలో ఉన్న పంజాబ్‎ను కూడా కాపాడుకోలేకపోయింది. దాంతో పార్టీ అధిష్టానం దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. అందులో భాగంగా.. ఆ ఐదు రాష్ట్రాలకు కొత్త పీసీసీలను ఎన్నుకోవాలని నిర్ణయించింది. దాంతో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్‌ల పీసీసీ అధ్యక్షులను రాజీనామాలు చేయాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కోరినట్లు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ రణదీప్ సూర్జేవాలా తెలిపారు.