ఆ చిన్నారుల‌ను న‌వోద‌య విద్యాల‌యాల్లో చేర్పించాలి

ఆ చిన్నారుల‌ను న‌వోద‌య విద్యాల‌యాల్లో చేర్పించాలి

న్యూఢిల్లీ: కరోనాతో తల్లిదండ్రులను, కుటుంబంలో సంపాదించే వ్యక్తులను కోల్పోయిన చిన్నారుల ఆదుకోవాల‌ని ప్ర‌ధాని మోడీకి లేఖ రాసిన‌ట్లు తెలిపారు కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ. బాధిత చిన్నారుల‌కు నవోదయ విద్యాలయాల్లో ఉచిత విద్య అందించాలన్నారు. ఉచిత విద్య అందించి వారి భవిష్యత్తు భరోసా ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోడీని కోరాన‌న్నారు.

ఈ విపత్కర, విషాద పరిస్థితుల్లో వారిని ఆదుకుని ఉజ్వల్ భవిష్యత్ అందించాలని ఆ లేఖలో కోరిన‌ట్లు సోనియా చెప్పారు. వారికి సంభవించిన అనూహ్యమైన విషాదం తర్వాత చిన్నారులకు గొప్ప భవిష్యత్తు కోసం ఆశలు కల్పించాల్సిన అవసరం ఓ దేశంగా మనకు ఉందని తెలిపారు.  కరోనా మహమ్మారి కారణంగా పిల్లలు తమ తండ్రుల్లో ఎవరో ఒకరిని కోల్పోయినట్టు వార్తలు వస్తున్న విషయాన్ని లేఖలో ప్రస్తావించాన‌ని.. దేశవ్యాప్తంగా నవోదయ విద్యాలయాలను తన భర్త, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఏ లక్ష్యంతో ఏర్పాటు చేసిందీ ఈ సందర్భంగా గుర్తు చేశారు సోనియా.