యూపీ స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్ ప్రకటించిన కాంగ్రెస్

V6 Velugu Posted on Jan 24, 2022

ఉత్తర్ ప్రదేశ్ అంసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నాయి. యూపీలో కాంగ్రెస్ పార్టీ ప్రచార బాధ్యతల్ని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు భుజానికెత్తుకతున్నారు. తాజాగా రాష్ట్రంలో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసే 30 మంది స్టార్ క్యాంపెయినర్ల లిస్టును విడుదల చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, సల్మాన్ ఖుర్షీద్, అశోక్ గెహ్లాట్, రాజ్ బబ్బర్, సచిన్ పైలెట్ తదితరుల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. 
యూపీలో బీజేపీ తరఫున సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ప్రచారం చేస్తున్నారు. సమాజ్ వాదీ తరఫున ఆ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ క్యాంపెయినింగ్ బాధ్యతల్ని భుజానికెత్తుకున్నారు.

 

Tagged Congress, Sonia Gandhi, National, manmohan singh, UP polls, star campaigner

Latest Videos

Subscribe Now

More News