
ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ సోనీ రూ.13,99,990విలువగల ఎల్‌ఈడీ టీవీ, జెడ్ 8 హెచ్ ని మార్కెట్ లో విడుదల చేసింది. 85అంగుళాల పొడవు, 8కేఎల్ ఈడీ టీవీ 7680 x 4320 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌తో దేశంలో ఇదే అత్యంత ఖరీదైన టీవీ అని సోని తెలిపింది. ‘రెడీ ఫర్ ప్లేస్టేషన్ 5’ అని పిలిచే ఈ టీవీ ఈ ఏడాది నవంబర్‌లో మార్కెట్ లో అందుబాటులోకి రానుంది. గదిలో లేదా వ్యక్తిగత హోమ్ థియేటర్‌లో వీక్షించేలా డిజైన్ చేసింది. దీంతో పాటు పిక్చర్ ప్రాసెసర్ ఎక్స్ 1, టీవీని ప్లేస్టేషన్ 5 కి కనెక్ట్ చేయవచ్చు. 4 కె క్వాలిటీలో 120 ఎఫ్‌పిఎస్ వద్ద ప్లే చేయవచ్చు. సోనీ జెడ్ 8 హెచ్ యొక్క శక్తివంతమైన ప్రాసెసర్ తో పలు రకలా ఫీచర్స్ ఉన్నాయి. రిఫ్రెష్ రేటు అల్ట్రా HD రిజల్యూషన్ వద్ద 120Hz వరకు వెళ్ళవచ్చు. ఇది లోకల్ డిమ్మింగ్‌తో పాటు ఎక్స్-టెండెడ్ డైనమిక్ రేంజ్ ప్రో తో పాటు ఫుల్-అర్రే ఎల్‌ఇడి-బ్యాక్‌లిట్ డిస్ ప్లే వస్తుంది. టీవీ వెనుక భాగంలో నాలుగు హెచ్‌డిఎంఐ పోర్ట్‌లను మరియు కనెక్టివిటీ కోసం మూడు యుఎస్‌బి పోర్ట్‌లను అందిస్తుంది.