సూకీని రిలీజ్​ చేయాల్సిందే.. మయన్మార్ లో వెల్లువెత్తిన నిరసనలు

సూకీని రిలీజ్​ చేయాల్సిందే.. మయన్మార్ లో వెల్లువెత్తిన నిరసనలు
  • ఇంటర్నెట్ రీస్టోర్ చేసిన మిలటరీ

యాంగోన్: మయన్మార్ లో మిలటరీ తిరుగుబాటుకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలోని అతిపెద్ద సిటీ యాంగోన్ లో శనివారం వెయ్యి మందికి పైగా నిరసన ర్యాలీ నిర్వహించగా.. మిలటరీ పాలకులు దేశమంతా ఇంటర్నెట్ సర్వీసులను బంద్ చేశారు. ఆదివారం నిరసనకారులు పెద్ద సంఖ్యలో రోడ్లెక్కారు. మాండలే సిటీతో పాటు దేశంలోని చాలా చోట్ల నిరసనలు జరిగాయి. యాంగోన్ లోని వివిధ ప్రాంతాల నుంచి సిటీ నడిబొడ్డున ఉన్న సూలే పగోడా వద్దకు చేరుకున్న వేలాది మంది ట్రేడ్ యూనియన్ల కార్మికులు, స్టూడెంట్లు, ప్రజలు భారీ నిరసన ప్రదర్శన చేశారు. నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ (ఎన్ఎల్డీ) నేత ఆంగ్ సాన్ సూకీని, ప్రెసిడెంట్ విన్ మింట్ ను విడుదల చేయాలని, ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని రీస్టోర్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ప్లకార్డులు పట్టుకుని, లాంగ్ లివ్ మదర్ సూ, మిలటరీ డిక్టేటర్ షిప్ నశించాలని నినాదాలు చేశారు. గత నవంబర్ లో జరిగిన ఎన్నికల్లో సూకీ ఆధ్వర్యంలోని ఎన్ఎల్డీ ఘన విజయం సాధించింది. అయితే, ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ మిలటరీ తిరుగుబాటు చేసింది. గత సోమవారం సూకీతో పాటు కీలక నేతలు, అధికారులను అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో మిలటరీ తీరుపై రోజురోజుకూ నిరసనలు పెరుగుతున్నాయి. మయన్మార్ లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని, లేకపోతే అంతర్జాతీయ సమాజాన్ని ఏకం చేస్తామని ఐక్యరాజ్యసమితి కూడా ఇదివరకే మిలటరీ పాలకులను హెచ్చరించింది.

ఇవి కూడా చదవండి..

ధరణిలో అర్జీల ఆప్షన్ డిలీట్

అచ్చంపేట టు హైదరాబాద్​..  రేవంత్​ పాదయాత్ర

మేం అధికారంలోకి వస్తే కేసీఆర్ జైలుకే

మూడు నెలల సదువులకు ఏడాది ఫీజు కట్టాల్నట

గవర్నర్ లెటర్​తో సర్కారులో కదలిక