ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సరికొత్త ప్రయోగాలు ఎప్పుడూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంటాయి. ఇపుడు అలాంటి ఓ మూవీ ఇవాళ (మే 22, 2026న) ప్రేక్షకుల ముందుకొచ్చింది. 'హేమంత్ ఆర్ట్స్' పతాకంపై హేమంత్ ఇప్పలపల్లి కథ, దర్శకత్వ బాధ్యతలతో పాటు నిర్మించిన మూవీ ‘ఫస్ట్ టైం’ (First Time). డిఫెరెంట్ కాన్సెప్ట్‌తో సైన్స్ ఫిక్షన్ డ్రామాగా రూపొందింది.
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వాడకుండా, కేవలం 'హ్యూమన్ ఇంటెలిజెన్స్' నమ్ముకుని, భారీ విజువల్ ఎఫెక్ట్స్ హంగులతో తక్కువ బడ్జెట్‌లో తెరకెకెక్కింది. ఇందులో పాయల్ రాజ్ పుత్ బాయ్ ఫ్రెండ్ సౌరబ్ ధింగ్ర హీరోగా అరంగేట్రం చేశాడు. అనికా విక్రమన్ హీరోయిన్‌గా నటించింది. ప్రమోషన్స్లో కూడా పాయల్ పాల్గొని ప్రేక్షకుల్లో అంచనాలు పెంచింది. కొత్త కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ న్యూ ఏజ్ సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటంటే:
సినిమా కథ 2304వ సంవత్సరం (2304 AD) లో ఏలియన్స్ బ్యాక్‌డ్రాప్‌తో ప్రారంభమవుతుంది. అసలు ఈ కలియుగం ఎలా అంతమైంది? కొత్త సృష్టి ఎలా మొదలైంది? సరికొత్త భారత ప్రపంచం ఎలా ఆవిర్భవించింది? అనే అంశాల చుట్టూ కథ తిరుగుతుంది. సృష్టిలోని ఒక పవిత్రమైన స్త్రీ కొత్త యుగానికి ఎలా నాంది పలికింది అనే ఫ్లాష్‌బ్యాక్ సంఘటనలను ఏలియన్లకు వివరించే క్రమంలో అసలు కథ నడుస్తుంది.
అనిక్క విక్రమన్ (హీరోయిన్) ను ఎలాగైనా దక్కించుకోవాలని ఆమె బావ భూపాల్ రాజు (విలన్), అలాగే మరో విలన్ శివకుమార్ రామచంద్రవరపుతో పాటు అఖిల్ సార్థక్ ప్రయత్నిస్తుంటారు. ఈ విపత్కర పరిస్థితుల నుంచి అనిక్క ఎలా తప్పించుకుంది? ఈ ప్రయాణంలో ఆమెకు సౌరబ్ ధింగ్ర (హీరో) ఎలా పరిచయమయ్యాడు? చివరికి వీరంతా కలిసి సరికొత్త ప్రపంచాన్ని ఎలా సృష్టించారు? అనేదే అసలు సస్పెన్స్.
ALSO READ : పెళ్లయిన మగాళ్లకు కనెక్ట్ అయ్యే కథ.. ‘పురుష:’ ఎలా ఉందంటే?
విశ్లేషణ:
‘ఫస్ట్ టైం’ మూవీ: ఇదొక సాధారణ కమర్షియల్ సినిమా కాదు. సైన్స్ ఫిక్షన్, ఏలియన్ కాన్సెప్ట్, ఫ్యూచరిస్టిక్ వరల్డ్ బిల్డింగ్‌తో దర్శకుడు హేమంత్ ఇప్పలపల్లి కొత్త ఆలోచనను తెరపై చూపించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా AI టూల్స్ వాడకుండా కేవలం హ్యూమన్ ఇంటెలిజెన్స్‌తో భారీ విజువల్ ఎఫెక్ట్స్ రూపొందించడం ఈ చిత్రానికి ప్రత్యేకత. తక్కువ బడ్జెట్‌లో హాలీవుడ్ స్టైల్ విజువల్స్ ఇవ్వాలన్న ప్రయత్నం ప్రశంసనీయం.
ఎవరెలా నటించారంటే:
ఈ సినిమాతో హీరోగా పరిచయమైన సౌరబ్ ధింగ్రకు ఇది మొదటి చిత్రమే అయినప్పటికీ చాలా మెచ్యూర్డ్ యాక్టింగ్‌తో మెప్పించాడు. హీరోయిన్ అనిక్క విక్రమన్ కేవలం గ్లామర్‌తోనే కాకుండా నటనతోనూ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ‘బిగ్ బాస్’ ఫేమ్ అఖిల్ సార్థక్ సెకండ్ లీడ్‌గా తన మార్క్ చూపించగా, విలన్లుగా భూపాల్ రాజు, శివకుమార్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. మైమ్ గోపి, అజయ్ రత్నం, అన్నపూర్ణమ్మ, గాయత్రి గుప్తా తమ అనుభవంతో కథను ముందుకు నడిపించారు.
టెక్నీకల్ అంశాలు:
ఈ సినిమాకు ప్రధాన బలం హేమంత్ ఇప్పలపల్లి గతంలో ఉన్న విఎఫ్ఎక్స్ అనుభవమే. ఎలాంటి ఏఐ టూల్స్ వాడకుండా కేవలం మానవ మేధస్సుతో, తక్కువ బడ్జెట్‌లో హాలీవుడ్ స్థాయి గ్రాండ్ విజువల్స్‌ను స్క్రీన్‌పై ప్రెజెంట్ చేశారు. వేణు మురళీధర్, రామ్ అందించిన సినిమాటోగ్రఫీ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది.
శ్రీ వెంకట్, సూరజ్ ఎస్ కురుప్ అందించిన సాంగ్స్ యావరేజ్. అయినప్పటికీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తో సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లారు. కొత్త కాన్సెప్ట్‌లు, సైన్స్ ఫిక్షన్ డ్రామాలు ఇష్టపడే ప్రేక్షకులకు ‘ఫస్ట్ టైం’ ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వగల సినిమా.
