ODI World Cup 2023: ఇండియా-సౌత్ ఆఫ్రికా మ్యాచ్.. ఆ ఒక్క విషయంలో సఫారీలదే పై చేయి

ODI World Cup 2023: ఇండియా-సౌత్ ఆఫ్రికా మ్యాచ్.. ఆ ఒక్క విషయంలో సఫారీలదే పై చేయి

ఇండియా-సౌత్ ఆఫ్రికా వరల్డ్ కప్ ముందు వరకు ఈ మ్యాచ్ మీద ఎవరికీ పెద్దగా ఆసక్తి లేదు. కానీ ఈ మెగా టోర్నీలో సఫారీలు ఆడుతున్న తీరు చూసిన తర్వాత భారత్ కు గట్టి పోటీనిచ్చే ఒకే ఒక టీం దక్షిణాఫ్రికా అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్ ల్లో భారత్ విజయం సాధిస్తే.. ఆడిన 7 మ్యాచ్ ల్లో దక్షిణాఫ్రికా ఆరు విజయాలు సొంతం చేసుకుంది. చాలా మ్యాచ్ ల్లో దక్షిణాఫ్రికా భారీ తేడాతో ప్రత్యర్థులను చిత్తు చేయడం విశేషం.

ఈ నేపధ్యంలో పటిష్టమైన భారత్ కు షాక్ ఇవ్వడానికి నేడు (నవంబర్ 5) సిద్ధమైపోయింది.కోల్ కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరగనున్న ఈ మ్యాచ్ లో రెండు జట్లు కూడా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగా కనిపిస్తున్నాయి. కానీ మిడిల్ ఆర్డర్ విషయంలో మాత్రం సఫారీలదే పై చేయి గా కనిపిస్తుంది. భారత జట్టు బలం టాపార్డర్. ఓపెనర్లు గిల్, రోహిత్ తో పాటు విరాట్ కోహ్లీ టాప్ ఫామ్ లో ఉన్నారు. వీరు ముగ్గురు ఫెయిల్ అయితే మాత్రం భారత్ పరుగుల కోసం శ్రమిస్తోంది. 

మిడిల్ ఆర్డర్ లో సూర్య, అయ్యర్ లాంటి  ప్రతిభ కలిగిన ఆటగాళ్లు ఉన్నా నిలకడలేమి వీరి ప్రధాన సమస్య. కానీ సౌత్ ఆఫ్రికా ఆటగాళ్ల పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా కనిపిస్తుంది. ఓపెనర్లు ఔటైనా మిడిల్ ఆర్డర్ ఎలాంటి ఒత్తిడికి లోను కారు. ప్రత్యర్థి ఏదైనా బౌలర్ ఎవరైనా ఎటాకింగ్ చేస్తూ ఆధిపత్యం చూపిస్తారు. మార్కరం, క్లాసన్, మిల్లర్, జాన్సెన్ లాంటి ఆటగాళ్లతో ఆ జట్టు దుర్బేధ్యంగా కనిపిస్తుంది. ఇటీవలే కాలంలో దక్షిణాఫ్రికా మిడిల్ ఆర్డర్ ఉన్నంత బలంగా మరే జట్టు కూడా లేదు. నిలకడగా ఆడడంతో పాటు వేగంగా పరుగులు చేయడం వీరి స్పెషాలిటీ.

వాండర్ డస్సెన్, మార్కరం, క్లాసన్ ఈ వరల్డ్ కప్ లో మెరుపు సెంచరీలు చేస్తే లోయర్ ఆర్డర్ లో మిల్లర్, జాన్సెన్ వేగంగా పరుగులు చేస్తున్నారు. దక్షిణాఫ్రికా మిడిల్ ఆర్డర్ బ్యాటర్లను భారత బౌలర్లు ఎలా నిలువరిస్తారో అనే దానిపై భారత విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. మరి ఈ మ్యాచ్ లో సఫారీలు భారత్ జోరుకు బ్రేక్ లు వేస్తారో లేదో చూడాలి.