
హైదరాబాద్ సిటీ, వెలుగు: రాబోయే పండుగల సీజన్ నేపథ్యంలో 22 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. దసరా, దీపావళి, ఛత్ పండుగలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ చెప్పారు. సెప్టెంబర్ 4 నుంచి 25 వరకు సికింద్రాబాద్- తిరుపతి మధ్య 4 సర్వీసులు, సెప్టెంబర్ 5 నుంచి 26 వరకు తిరుపతి–సికింద్రాబాద్ మధ్య 4 సర్వీసులు అందుబాటులో ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
సెప్టెంబర్ 4 నుంచి 25 వరకు కాచిగూడ– నాగర్ సోల్ మధ్య 4 సర్వీసులు, సెప్టెంబర్ 5 నుంచి 26 వరకు నాగర్ సోల్– కాచిగూడ మధ్య 4 సర్వీసులు నడుస్తాయని వివరించారు. సెప్టంబర్ 19 నుంచి అక్టోబర్ 3 వరకు సంత్రాగ్జి–చర్లపల్లి మధ్య 3 సర్వీసులు, సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 4 వరకు చర్లపల్లి–సంత్రాగ్జి మధ్య 3 సర్వీసులు ఉంటాయని ఆఫీసర్లు తెలిపారు.