షాకింగ్ సర్వే... 1.5 మిలియన్ ప్రజలకు చనిపోవాలనే ఆలోచనలు

షాకింగ్ సర్వే... 1.5 మిలియన్  ప్రజలకు చనిపోవాలనే ఆలోచనలు

దక్షిణ కొరియా ప్రభుత్వం అక్కడి ప్రజలకు షాకింగ్ న్యూస్ తెలిపింది. కొరియాలో 1.5 మిలియన్లకు పైగా ప్రజలు లోన్లీ డెత్ (ఒంటరి మరణం)కు  గురయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది.  దేశ జనాభాలో 3 శాతం మంది ఈ విధంగా  ఉన్నారని ప్రభుత్వ సర్వే వెల్లడించింది.

దక్షిణ కొరియా ఆరోగ్య, సంక్షేమ మంత్రిత్వ శాఖ 2022  నవంబర్ నుండి డిసెంబర్ వరకు 9,471 ఒంటరి సభ్యుల కుటుంబాలపై సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో భవిష్యత్తులో ఒంటరి మరణానికి దారితీసే ఆ కుటుంబాల పరిస్థితులపై అధ్యయనం చేసినట్లు  యోన్‌హాప్ న్యూస్ ఏజెన్సీ నివేదించింది.

దక్షిణ కొరియా లోన్లీ డెత్ ప్రివెన్షన్ అండ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ ప్రకారం  ఒంటరిగా చనిపోవాలి అనుకునే వారు బంధువులు లేరనే బాధతోనో...లేక కష్టాల్లో, సమస్యల్లో ఒంటరిగా పోరాడుతున్నా అనుకునేవారు చనిపోవాలని అనుకుంటున్నారని తేలింది. దక్షిణ కొరియా ఆరోగ్య, సంక్షేమ మంత్రిత్వ శాఖ  సర్వే ప్రకారం ఆ దేశంలో 1.52 మిలియన్ల మంది ఒంటరి మరణానికి గురయ్యే అవకాశం ఉందని వెల్లడైంది.

సౌత్ కొరియాలో 51.7 మిలియన్ల జనాభా ఉండగా..అందులో 3 శాతం,  మొత్తం కుటుంబాల్లో 21.3 శాతం జనాభాలో లోన్లీ డెత్ ఆలోచనలు వస్తున్నట్లు పేర్కొంది. వారిలో  60 ఏళ్లలోపు వ్యక్తులు 30. 2 శాతం...వారి 50 ఏళ్లలోపు వ్యక్తులు 33.9 శాతం ఉన్నారు.  40 ఏళ్లలోపు వ్యక్తులు 25.8 శాతం ఉన్నారు. 30 ఏళ్ల లోపు వ్యక్తులు 16.6 శాతం .. 20 ఏళ్ల లోపు వ్యక్తులు 9.7 శాతం ఉన్నట్లు తేలింది. 

సౌత్ కొరియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం 2021లో 3,378 మరణాలు నమోదయ్యాయి, గత ఐదేళ్లలో సగటు వార్షిక రేటు 8.8 శాతం వృద్ధి చెందింది. అయితే దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టిన సౌత్ కొరియా 2027 నాటికి ఒంటరి మరణాల సంఖ్యను 20 శాతానికి తగ్గించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో  ప్రమాదంలో ఉన్న వ్యక్తుల కోసం తగిన సాయాన్ని అందించాలని నిర్ణయించింది. సామాజికంగా ఒంటరిగా ఉన్న వారిని ముందుగానే గుర్తిస్తామని తెలిపింది.