పారిస్: పిల్లల మానసిక ఆరోగ్యాన్ని పరిరక్షించే దిశంగా ఫ్రాన్స్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది.15 ఏండ్లలోపు చిన్నారులు సోషల్ మీడియాను ఉపయోగించకుండా నిషేధించే బిల్లుకు సర్కారు ఆమోదం తెలిపింది.
సోమవారం అర్ధరాత్రి జరిగిన ఓటింగ్లో 130–21 ఓట్ల తేడాతో ఈ బిల్లు ఆమోదం పొందింది. సెప్టెంబర్లో ప్రారంభమయ్యే వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ చట్టం అమల్లోకి రానుంది.
