సీఈఐఆర్ అప్లికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సద్వినియోగం చేసుకోవాలి : అశోక్ కుమార్

సీఈఐఆర్ అప్లికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సద్వినియోగం చేసుకోవాలి : అశోక్ కుమార్
  •  ఎస్పీ అశోక్ కుమార్

జగిత్యాల టౌన్, వెలుగు: మొబైల్ ఫోన్ పోయిన, చోరీకి గురైనా ఆందోళన చెందొద్దని ఎస్పీ అశోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూచించారు. www.ceir.gov.in (సీఈఐఆర్) అప్లికేషన్ ద్వారా తిరిగి పొందొచ్చని చెప్పారు. శుక్రవారం జిల్లా పోలీస్ ఆఫీసులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోగొట్టుకున్న, చోరీకి గురైన  102 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని బాధితులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోయినా, చోరీకి గురైనా వెంటనే కంప్లైంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలన్నారు. 

సీఈఐఆర్ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వినియోగదారులు తమ వివరాలను నమోదు చేసుకుంటే ఫోన్లను రికవరీ చేయొచ్చన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 986 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించినట్లు అన్నారు. సైబర్ మోసాలకు గురైతే హెల్ప్ లైన్ నంబర్ 1930కు, లేదా స్థానిక పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఐటీ కోర్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రఫీక్ ఖాన్, కృష్ణ, మహమూద్, అజర్, మల్లేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

పోలీస్ యాక్ట్ అమలు

శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకొని మే1 నుంచి 31వరకు జిల్లావ్యాప్తంగా పోలీస్ శాఖ అమల్లో ఉంటుందని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. పోలీస్ అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, నిరసనలు, సభలు, సమావేశం నిర్వహించొద్దని సూచించారు.