బాల కార్మికులు లేని సమాజం కోసం కృషి చేద్దాం : ఎస్పీ బి. రోహిత్ రాజు

బాల కార్మికులు లేని సమాజం కోసం కృషి చేద్దాం : ఎస్పీ బి. రోహిత్ రాజు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : బాల కార్మికులు లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ బి. రోహిత్​ రాజు పేర్కొన్నారు. ఈ నెల 1 నుంచి 31 వరకు స్మైల్–12 ప్రోగ్రామ్​ను చేపడుతున్నట్టు తెలిపారు. ఇందుకు సంబంధించిన వాల్​ పోస్టర్లను ఎస్పీ ఆఫీస్​లో శుక్రవారం జరిగిన ప్రోగ్రామ్​లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు, భద్రాచలం, పాల్వంచ, మణుగూరు డివిజన్లలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. 

అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి స్మైల్​ ప్రోగ్రామ్​ను సక్సెస్​ చేయాలని కోరారు.  షాపులు, హోటల్స్​, పరిశ్రమలు, మెకానిక్​ షెడ్స్​ ల్లో బాలకార్మికులుంటే 100 నెంబర్​తో పాటు 1098 నెంబర్లకు ఫోన్​ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. చిన్న పిల్లలతో బలవంతంగా బిక్షాటన, వెట్టి చాకిరీ చేయించేవారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ  ప్రోగ్రామ్​లో ఎస్పీ ఇన్సిపెక్టర్​ శ్రీనివాస్​, డీసీఆర్బీ సీఐ శ్రీనివాస్, ఐటీ సెల్​ ఇన్సిపెక్టర్​ రాము, జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లెనినా, డీసీపీఓ హరికుమారి, షీ టీమ్​ ఎస్సై రమాదేవి పాల్గొన్నారు.