
మహబూబ్ నగర్ అర్బన్, వెలుగు: సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ డి. జానకి సూచించారు. వార్షిక తనిఖీలో భాగంగా మహబూబ్‌నగర్ రూరల్ సర్కిల్ ఆఫీస్‌ను ఆమె సందర్శించి, వివిధ విభాగాల పనితీరును రివ్యూ చేశారు.
సర్కిల్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని, ట్రాఫిక్ వ్యవస్థను క్రమబద్దీకరించాలని సూచించారు. మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, దొంగతనాల నివారణపై దృష్టి పెట్టాలన్నారు. డీఎస్పీ రమణారెడ్డి, రూరల్ సీఐ గాంధీ నాయక్, రూరల్, హన్వాడ, నవాబుపేట, కోయిలకొండ, మహమ్మదాబాద్ ఎస్సైలు పాల్గొన్నారు.