భరోసా కేంద్రంలో మహిళలకు న్యాయం : ఎస్పీ జానకి

భరోసా కేంద్రంలో మహిళలకు న్యాయం : ఎస్పీ జానకి

మహబూబ్ నగర్ అర్బన్, వెలుగు: జిల్లా భరోసా కేంద్రం వార్షికోత్సవం బుధవారం  ఎస్పీ జానకి అధ్యక్షతన ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్‌‌‌‌పర్సన్ ఇందిరా మాట్లాడుతూ..  భరోసా కేంద్రం మహిళలు, బాలికలకు న్యాయం అందించడంలో గతేడాది విశేష పురోగతి సాధించిందని తెలిపారు.

 బాధితులకు న్యాయ సహాయం, పునరావాసం వంటి అంశాల్లో  కేంద్రం అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు.  భరోసా సేవలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.  ఎస్పీ జానకి మాట్లాడుతూ..  మహిళల భద్రతకు, పిల్లల రక్షణకు భరోసా కేంద్రం వేదికగా నిలిచిందని చెప్పారు.