అవుట్ పోస్ట్ పనులు క్వాలిటీతో చేయాలి : ఎస్పీ రావుల గిరిధర్

అవుట్ పోస్ట్ పనులు క్వాలిటీతో చేయాలి : ఎస్పీ రావుల గిరిధర్

వనపర్తి, వెలుగు: జూరాల ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయడానికి ఏర్పాటు చేస్తున్న పోలీస్​ అవుట్​ పోస్ట్​ పనులను క్వాలిటీతో చేపట్టాలని ఎస్పీ రావుల గిరిధర్​ ఆదేశించారు. బుధవారం అవుట్  పోస్ట్  పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవుట్‌‌‌‌ పోస్ట్  ఏర్పాటుతో ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో పోలీస్​ సేవలు మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. ఆత్మకూర్  సీఐ శివకుమార్, అమరచింత ఎస్సై స్వాతి పాల్గొన్నారు. 

విజేతలను అభినందించిన ఎస్పీ..

ఉమ్మడి జిల్లా 5 కి.మీ. స్పీడ్​ సైకిల్​ రేస్​లో ప్రతిభ చూపిన కానిస్టేబుల్​ కూతుళ్లను ఎస్పీ అభినందించారు. కానిస్టేబుల్​ నాగరాజ్​గౌడ్​ కూతుళ్లు మనస్వి, జ్ఙాపిక రేస్​లో పాల్గొని ఫస్ట్, థర్డ్​  ప్లేస్​లో నిలిచారు. జిల్లా పోలీస్​ ఆఫీస్​లో వారికి ఎస్పీ శాలువాలు కప్పి సన్మానించారు. పోలీసుల పిల్లలు వివిధరంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. డీఎస్పీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.