రోడ్​ సేఫ్టీ రూల్స్ పాటించాలి : ఎస్పీ రితిరాజ్

రోడ్​ సేఫ్టీ రూల్స్ పాటించాలి : ఎస్పీ రితిరాజ్

గద్వాల, వెలుగు: రోడ్​ సేఫ్టీ రూల్స్ ను పాటించడంతోనే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని ఎస్పీ రితిరాజ్  పేర్కొన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా రూల్స్​పై అవగాహన కల్పించాలని పోలీస్  ఆఫీసర్లను ఆదేశించారు.

మూడు రోజుల పాటు హెల్మెట్  ధరించిన వారిని అభినందిస్తూ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఆ తరువాత హెల్మెట్  ధరించని వారికి ఫైన్​ విధించాలని సూచించారు. ఇందులోభాగంగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా వాహనదారులకు రోడ్డు భద్రతా నియమాలను వివరించారు. హెల్మెట్  ధరించిన వారిని అభినందించారు