పాల్వంచ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ

పాల్వంచ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ

పాల్వంచ, వెలుగు : పాల్వంచ పోలీస్ స్టేషన్ ను ఎస్పీ రోహిత్ రాజ్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెండింగ్ కేసులపై ఆరా తీశారు. ఫిర్యాదుదారుల పట్ల మ ర్యాదగా నడుచుకోవాలని సిబ్బందికి సూచించారు. అనంతరం స్టేషన్​ ఆవరణలో కొబ్బరి మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సతీశ్​కుమార్, సీఐ కె.సతీశ్, అశ్వారావుపేట సీఐ నాగరాజు, టౌన్ ఎస్సై సుమన్, అడిషనల్ ఎస్సైలు జీవన్ రాజ్, కళ్యాణి, సిబ్బంది  పాల్గొన్నారు.