ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి : యోగేశ్​ గౌతమ్

ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి :  యోగేశ్​ గౌతమ్

నారాయణపేట, వెలుగు :  జిల్లాలో పార్లమెంట్  ఎన్నికలు సజావుగా జరిగేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఎస్పీ యోగేశ్​ గౌతమ్  పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఎస్పీ క్యాంప్  ఆఫీస్​లో ఎక్సైజ్, పోలీస్  అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల సంఘం నియమాలను అమలు చేయాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టి ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. 

అక్రమ మద్యంపై దృష్టి పెట్టాలన్నారు. జిల్లాలోని బెల్ట్  షాపుల్లో మద్యం అమ్మకాలను అరికట్టాలని, బార్డర్  చెక్ పోస్టుల వద్ద పోలీసులతో పాటు ఎక్సైజ్ పోలీసులను నియమించాలని సూచించారు. సరిహద్దు చెక్​పోస్ట్  వద్ద తనిఖీలు చేపట్టి డబ్బు, మద్యం, గంజాయి, బంగారం, ఇతర విలువైన వస్తువులు రవాణా కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. డీఎస్పీ లింగయ్య, అసిస్టెంట్  ఎక్సైజ్  సూపరింటెండెంట్  సుధాకర్, పేట, కోస్గి ఎక్సైజ్  సీఐలు అశోక్ కుమార్, బాలకృష్ణ, ఎస్ఐలు రమేశ్, గురువయ్య, శిరీష పాల్గొన్నారు.