అజేయంగా ఆఖరాటకు... యూరో 2024 ఫైనల్లో స్పెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

అజేయంగా ఆఖరాటకు... యూరో 2024 ఫైనల్లో స్పెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

మ్యూనిక్:  యూరోపియన్ ఫుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాల్ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అంచనాలను అందుకున్న స్పెయిన్ అజేయంగా ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దూసుకెళ్లింది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన తొలి సెమీఫైనల్లో ఆ జట్టు 2–1 తేడాతో ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓడించింది. ఆట మొదలైన తొమ్మిదో నిమిషంలోనే కిలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంబాపె నుంచి క్రాస్ అందుకున్న రండల్ కొలో మువాని గోల్ చేసి ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను 1–0తో ఆధిక్యంలో నిలిపాడు.

అయితే, 21 నిమిషంలో 16 ఏండ్ల స్పెయిన్ యంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టర్ లమినె యమల్ కొట్టిన గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో స్కోరు 1–1తో సమం అయింది. ఈ టోర్నీలో గోల్ సాధించిన యంగెస్ట్ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా యమల్ రికార్డు సృష్టించాడు. నాలుగు నిమిషాల తర్వాత డాని ఒల్మో  చేసిన గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో 2–1తో ఆధిక్యంలోకి వచ్చిన స్పెయిన్ చివరి వరకూ దాన్ని కాపాడుకొని ఫైనల్ చేరుకుంది. కాగా, యూరోలో  ఆడిన అన్ని మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లోనూ గెలిచి ఫైనల్ చేరిన తొలి జట్టుగా స్పెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రికార్డు సృష్టించింది. అలాగే, ఒక ఎడిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అత్యధిక గోల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన ఫ్రాన్స్ (1984లో 14) రికార్డును సమం చేసింది.