కరెంట్​ కష్టాలు తీర్చిన ఘనత కేసీఆర్‌‌దే : పోచారం శ్రీనివాస్​రెడ్డి

కరెంట్​ కష్టాలు తీర్చిన ఘనత కేసీఆర్‌‌దే : పోచారం శ్రీనివాస్​రెడ్డి
  • స్పీకర్ పోచారం శ్రీనివాస్​రెడ్డి

కోటగిరి, వెలుగు : తెలంగాణలో కరెంట్​కష్టాలు తీర్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని స్పీకర్ పోచారం శ్రీనివాస్​రెడ్డి పేర్కొన్నారు. కోటగిరిలో రూ.20 కోట్లతో నిర్మించిన 132 కేవీ సబ్‌స్టేషన్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కోటగిరి, పొతంగల్ మండలంలో 500 మందికి గృహలక్ష్మి మంజూరు పత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గ్రామాల్లో కనీసం ఏడు గంటల కరెంట్​ ఇవ్వలేకపోయారన్నారు.  

ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత రూ.96,500 కోట్లు ఖర్చు చేసి విద్యుత్ ఉత్పత్తిని 7780 మెగావాట్ల నుంచి 20 వేల మెగావాట్లకు పెంచారన్నారు. దీంతో రాష్ట్రంలో అన్ని గ్రామాలకు 24 గంటలు నిరంతరం కరెంట్​ అందుతుందన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పత్తి లక్ష్మణ్, జెన్‌కో డైరెక్టర్ జగత్ రెడ్డి, ఎంపీపీ వల్లెపల్లి సునిత, పోచారం సురేందర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ హమీద్, జడ్పీ కో ఆప్షన్ మెంబర్ సిరాజ్, వైస్ ఎంపీపీ గంగాధర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.