ఇచ్చినోళ్ల గురించి  కాదు.. తెచ్చినోళ్ల గురించి చెప్పుకోవాలి : ​ పోచారం  శ్రీనివాస్​రెడ్డి

ఇచ్చినోళ్ల గురించి  కాదు.. తెచ్చినోళ్ల గురించి చెప్పుకోవాలి : ​ పోచారం  శ్రీనివాస్​రెడ్డి
  • స్పీకర్​ పోచారం శ్రీనివాస్​రెడ్డి

కామారెడ్డి , వెలుగు :  తెలంగాణ ఇచ్చినోళ్ల గురించి కాదు.. తెచ్చినోళ్ల గురించి  చెప్పుకోవాలని స్పీకర్​ పోచారం  శ్రీనివాస్​రెడ్డి అన్నారు.  మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో  జాతీయ జెండాను  ఎగురవేశారు. అనంతరం  స్పీకర్​ మాట్లాడుతూ కొందరు నేతలు తెలంగాణ తామే ఇచ్చినమని మాట్లాడుతున్నారని, కానీ   ఎవరూ మనకు ఇయ్యలేదన్నారు.   కేసీఆర్​ నాయకత్వంలో  పోరాడి తెచ్చుకున్నామన్నారు.   దేశానికి స్వాతంత్య్రం తెచ్చిందే  మహాత్మాగాంధీ అని,  కానీ  బ్రిటిష్​ వాళ్లు ఇచ్చారని  చెప్పుకోవాలా అని ప్రశ్నించారు. మహాత్మాగాంధీ పోరాటానికి భయపడి బ్రిటిష్​ వాళ్లు దేశం వదిలిపెట్టి పారిపోయారన్నారు.    

పోరాడిన మహాత్మాగాంధీ  గురించే చెప్పుకోవాలన్నారు. తెలంగాణ తామే ఇచ్చినమని చెబితే..  మనం బ్రిటిష్​ వాళ్లకు కూడా  మొక్కాలా అని  స్పీకర్​ ప్రశ్నించారు. ఇదే విధంగా  తెలంగాణ ఇయ్యలే.   కేసీఆర్ నాయకత్వంలో  పోరాడి తెచ్చుకున్నామన్నారు.    స్టేట్​ ఏర్పడినప్పుడు  కోటి  8 లక్షల ఎకరాల్లో  పంటలు సాగయ్యేవని, కానీ ఇప్పుడు  2 కోట్ల 18 లక్షల ఎకరాలు సాగు చేస్తున్నామని చెప్పారు. రైతును రాజు చేసే పక్రియ తెలంగాణలోనే జరుగుతోందని స్పీకర్​ అన్నారు. ​