స్పీకర్ వస్తుండని భక్తులను ఆపుతుండ్రు

స్పీకర్ వస్తుండని భక్తులను ఆపుతుండ్రు

కొండగట్టు ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో ఆలయ పరిసర ప్రాంతాలన్నీ రద్దీగా మారాయి. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆంజనేయస్వామి దర్శనానికి రావడంతో వాహన పూజల కోసం వచ్చే భక్తులు ఇబ్బందులు పడ్డారు.

ఆంజనేయస్వామిని దర్శించుకుని తిరిగి వెళ్లేంత వరకు వాహన పూజలకు అనుమతించమంటూ పోలీస్ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారని భక్తులు వాపోయారు. వాహనాలు వస్తే తాము తప్పకుండా పూజలు చేస్తామని, పోలీసులు వాహనాలను ఆపితే తాము ఏమి చేయాలని పూజారులు ఆందోళన వ్యక్తం చేశారు.