జూన్‌ 24 నుంచి పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు

జూన్‌ 24 నుంచి పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు

జూన్ 24నుంచి 8 రోజుల పాటు  పార్లమెంట్ ప్రత్యేక  సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 8 రోజుల సెషన్‌లో జూన్ 26న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.  జూన్ 24, 25 తేదీల్లో కొత్త పార్లమెంట్ సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారని సమాచారం.  ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో  స్పీకర్ ఎంపిక చాలా ప్రాధన్యతను సంతరించుకుంది.  ఎన్డీఏ కూటమిలో కీలకంగా మారిన టీడీపీ, జేడీయూ పార్టీలు స్పీకర్ పదవి కోసం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.

టీడీపీకి చెందిన 16 మంది ఎంపీలు, జేడీయూకు చెందిన 12 మంది ఎంపీలతో కూడిన ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. మోదీ 3.0 క్యాబినెట్‌లో టీడీపీ, జేడీయూలకు రెండేసి చొప్పున పదవులు దక్కాయి (ఒక క్యాబినెట్, ఒక సహాయ మంత్రి). ఈ నేపథ్యంలో స్పీకర్ పదవి ఎవరికి దక్కుతుందనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.టీడీపీ స్పీకర్ పదవిని డిమాండ్ చేస్తుందని తెలుస్తోంది.  అయితే అత్యంత కీలకమైన ఈ పదవిని ఇతరులకు ఇచ్చేందుకు తాము ఆసక్తిలేవని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. చూడాలి మరి స్పీకర్ పదవి ఎవరికి దక్కుతుందో.