V6 News

మారెళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేయాలి .. వానాకాలం పంటకు రైతులకు నీరందించాలి..

మారెళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేయాలి .. వానాకాలం పంటకు రైతులకు నీరందించాలి..

మణుగూరు, వెలుగు : మారెళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పనులను వెంటనే పూర్తిచేయాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. అశ్వాపురం మండలంలో సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ కు అనుబంధంగా నిర్మిస్తున్న మారెళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పనులను శనివారం ఆయన పరిశీలించారు.

వేసవికాలం లిఫ్ట్ పనులకు అనుకూలంగా ఉన్నందున నిర్మాణం పూర్తి చేయాలని, రాబోయే వానాకాలం సీజన్ కు రైతులకు సాగునీరు అందించేలా చూడాలని అధికారులకు సూచించారు. మే నుంచి ప్రతిరోజు పనుల నివేదికను తనకు అందజేయాలని నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.