స్పైసీ ఫుడ్ వెచ్చగా ఉండే ప్రాంతాల్లో ఎక్కువ

 స్పైసీ ఫుడ్ వెచ్చగా ఉండే ప్రాంతాల్లో ఎక్కువ

ఏ ప్రదేశాల్లో ఉండే వాళ్లు ఎక్కువ స్పైసీ(మసాలా) ఫుడ్​ తింటారనే అంశంపై 70 ప్రాంతాలు, దేశాలకు చెందిన 33,750 రెసిపీలను పరీక్షించారు రీసెర్చర్స్. వాటిలో మొత్తం 93 రకాల మసాలాలు వాడటం గమనార్హం. ఈ రీసెర్చ్ ద్వారా వేడి వాతావరణంలో ఉండే వాళ్లు మసాలా ఫుడ్ ఎందుకు ఎక్కువగా తింటున్నారు? అలా తినడం వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ఎఫెక్ట్​ పడుతుంది? తెలుసుకోవాలి అనుకున్నారు. కానీ.. కల్చర్​, వాతావరణానికి మధ్య ఉన్న తేడాల వల్ల సరైన రిజల్ట్ రాలేదు. 

స్పైసీ ఫుడ్​తో కూల్​...కూల్​..

‘‘వాతావరణంలో ఉండే ఉష్ణోగ్రతల్లో తేడా వల్ల మసాలా​ వెరైటీలు వాడరు. అలాగే కల్చర్, మొక్కలు లేదా సహజంగా దొరికే దినుసులని బట్టి కూడా వాడ తారని చెప్పలేం. హెల్త్​ పరంగా చూస్తే మసాలాలను ఇన్ఫెక్షన్స్ తగ్గించేందుకు వాడరు. కానీ.. మసాలాలు, ఆరోగ్యం​, పేదరికం మధ్య ఒక రిలేషన్​ ఉంది” అంటున్నారు రీసెర్చర్లు. మరయితే వేడి ప్రాంతాల్లో ఉండే వాళ్లు మసాలాలను ఎందుకు ఎక్కువగా ఇష్టపడతారు? ఎందుకంటే... వేడి వాతావరణంలో ఆహారం పాడుకాకుండా ఉండడానికి మసాలాలు సాయపడతాయి కాబట్టి. వంటకాల్లో మసాలా వేయడం వల్ల ఆ వంటకానికి రుచి పెరుగుతుంది. అంతేకాదు మసాలా ఫుడ్ తినడం వల్ల ఎంత చిరాకులో ఉన్న వాళ్లయినా కూల్​ అయిపోతారట!

ఈ దేశాల్లో మసాలాలు ఎక్కువ

ప్రపంచంలోని వేడి వాతావరణం ఉన్న ప్రదేశాల్లో మసాలాలు ఎక్కువగా తినే దేశాల్లో ఇండోనేసియా, థాయ్​లాండ్, కరేబియన్, కెన్యా ఉన్నాయి. అదే మనదేశంలో అయితే పంజాబ్​, రాజస్తాన్​, గుజరాత్​ సహా చాలా రాష్ట్రాలు మసాలా ఫుడ్​ని బాగా ఎంజాయ్ చేస్తున్నాయి. వీటన్నింటినీ మించి మసాలాలు వాడే దేశం ఒకటుంది. అదే ఇథియోపియా. ఇథియోపియాలో వేడి కాస్త తక్కువే. అయినా మసాలాలు మాత్రం ఎక్కువగా వాడతారు. ఇక్కడ బాగా స్పైసీగా ఉండే వంటకం డోరో వాట్​. 

యూరప్​లో మసాలాలు ఎక్కువగానే తింటారు. వేడి వాతావరణం ఉండే పోలాండ్, ఇటలీ దేశాల్లో మసాలాలు బాగా తింటారు. ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ ప్రాంతాల ప్రజలు తక్కువ మసాలాలు తింటారు. బిట్రిష్​ వాళ్లు కూడా అంతే. యూరప్​ దేశాల్లో అతిఎక్కువగా మసాలా ఫుడ్​ తినే దేశం పోర్చుగల్. అమెరికాలో కూడా స్పైసీ ఫుడ్ బాగానే తింటారు. కాకపోతే దక్షిణ అమెరికాలో ఇంకా ఎక్కువ. అయితే మసాలా వాడకం విషయంలో లెబనాన్, ఇరాన్​తో దక్షిణ అమెరికా పోటీ పడుతుంది. 

మనదేశానికి వస్తే... మామూలుగానే మన ఫుడ్ స్పైసీగా ఉంటుంది. కాకపోతే వంటకాలను బట్టి  మసాలాల వాడకం మారుతుంటుంది. జైనుల సంప్రదాయ వంటకాల్లో  చాలా తక్కువ మసాలాలు వాడతారు.  బెంగాల్, గుజరాతీ వంటల్లో అమెరికా, పోర్చుగీసులాగే మసాలా ఎక్కువ వేస్తారు. మసాలాలు దట్టించిన ఫుడ్ తినాలంటే రాజస్తాన్, పంజాబ్​ వంటకాలకు ఓటేయాల్సిందే. మొఘలాయ్​ వంటకాలు ఇంకా ప్రత్యేకం.

అక్కడ ఒక్క స్పైస్​ మాత్రమే

తూర్పు ఆసియా ప్రధాన భూభాగంలో ఒక రెసిపీలో రెండు లేదా నాలుగు సుగంధ ద్రవ్యాలు మాత్రమే వాడతారు. జపాన్​లో అతి తక్కువ మసాలాలు వాడతారు. అక్కడ ఒక రెసిపీకి ఒక మసాలా వాడితే ఎక్కువట.

చల్లని ప్రదేశాల్లో ఉండే వాళ్లతో పోలిస్తే వెచ్చగా ఉండే ప్రాంతాల్లో స్పైసీ(మసాలా) ఫుడ్​ ఎక్కువగా తింటారట! వేడి వాతావరణంలో ఉండే ప్రజలు మసాలాలు​ ఎక్కువగా వాడడానికి ఇష్టపడతారంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ అది నిజం. ఎందుకంటే 33,750 రెసిపీలపై స్టడీ చేసి మరీ ఈ విషయాన్ని తేల్చారు రీసెర్చర్లు.

ఈ గ్రాఫ్​లో కనపడుతున్నవి బాగా రీసెర్చ్ చేశాక వచ్చిన రిజల్ట్స్. అంతేకాదు.. ఈ రీసెర్చ్​ మొదలుపెట్టేటప్పుడు స్పైస్​(మసాలా), హాట్(కారం) అనే రెండింటినీ ఒకే అర్థానికి వాడతారు. కానీ ఆ రెండింటినీ కలపొద్దు అనే కండిషన్​ పెట్టుకున్నారు. ఎందుకంటే స్వీట్​ స్పైసెస్​(తీపి మసాలాలు) కూడా ఉంటాయి. ఉదాహరణకు వెనీలా, కొత్తిమీర, అల్లం వంటివి. దీంతోపాటు మరో కండిషన్ కూడా పెట్టుకున్నారు. అదేంటంటే ప్రపంచంలో ఎక్కువగా తినే ఫుడ్ పరిగణనలోకి తీసుకోవడం. ఉదాహరణకు చికెన్ టిక్కా మసాలా తీసుకుంటే... ఇది మోడర్న్​ బ్రిటన్ నేషనల్​ డిష్​. దీన్ని1970లో కనుగొన్నారు. ఫిష్, చిప్స్ వంటి వాటికంటే టిక్కా చాలా స్పైసీ అని ఆ స్టడీలో తేలింది.