
హుజూర్‌నగర్, వెలుగు : అక్రమంగా నిల్వచేసిన స్పిరిట్‌తో పాటు నకిలీ మద్యాన్ని హుజూర్‌నగర్ ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను ఎక్సైజ్ సీఐ నాగార్జునరెడ్డి శుక్రవారం వెల్లడించారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలంలోని రామాపురం, దొండపాడు గ్రామాల్లో నకిలీ లిక్కర్ దందా నడుస్తున్నట్లు సమాచారం అందడంతో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేపట్టారు.
దీంతో ఆయా గ్రామాలకు చెందిన రంగిశెట్టి సైదేశ్వరరావు ఇంట్లో ఆరు కాటన్ల నకిలీ మద్యం, అతని స్నేహితులైన ప్రవీణ్, నరేశ్ ఇండ్లలో 30 లీటర్ల స్పిరిట్‌ను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ మద్యం కేసులో ఇప్పటివరకు 870 లీటర్ల స్పిరిట్, వంద కాటన్ల నకిలీ లిక్కర్‌తో పాటు ఓ ట్రాక్టర్, కారు, స్కూటీని సీజ్ చేసినట్లు సీఐ వెల్లడించారు. దాడుల్లో ఎస్సైలు జగన్ మోహన్‌రెడ్డి, వెన్నెల, డీటీఎఫ్ సీఐ స్టీఫెన్సన్ రామకృష్ణ, సిబ్బంది రుక్మారెడ్డి, ధనుంజయ్, నరేశ్, నాగరాజు, రవి, మధు, నాగయ్య పాల్గొన్నారు.