మహబూబ్ నగర్, వెలుగు: క్రీడలు క్రమశిక్షణ, మానసికోల్లాసాన్ని పెంపొందిస్తాయని నారాయణపేట ఎస్పీ వినీత్ తెలిపారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం పేటలోని స్టేడియం గ్రౌండ్ లో మెగా క్రికెట్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు. ఈ ఫ్రెండ్లీ మెగా క్రికెట్ టోర్నమెంట్లో జిల్లాలోని 30 టీమ్స్ పాల్గొంటుండగా, రెవెన్యూ, పోలీస్, మీడియా, డాక్టర్లు, లాయర్లు సైతం పాల్గొనడం అభినందనీయమన్నారు. డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐ శివశంకర్, ఎస్సై వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
