హనుమకొండ సిటీ, వెలుగు: వరంగల్ నిట్‌లో శుక్రవారం రాత్రి స్ప్రింగ్ స్ర్పీ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. రాసెంగన్ థీమ్‌తో నిర్వహించిన ఫెస్ట్‌ను నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈవెంట్లలో భాగస్వామ్యం కావడం వల్ల స్టూడెంట్లలోని సృజనాత్మకత వెలుగులోకి వస్తుందన్నారు.
అనంతరం నుక్కడ్ నాటక్, చెక్క, తోలు బొమ్మల ప్రదర్శన, దోషి కౌన్ అనే హిందీ డ్రామాతో పాటు, బ్యాండ్ చౌరస్తా, కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించారు. స్టూడెంట్ల డ్యాన్స్, మ్యూజిక్స్ ప్రోగ్రామ్స్‌తో హంగామా చేశారు. తర్వాత గ్రాఫిక్ డిజైనర్ కిరణ్ చేత వీడియో వర్క్‌షాప్ నిర్వహించారు.