నిమ్మకాయలతో ఎలక్ట్రిక్ బ్యాటరీలు తయారీ

నిమ్మకాయలతో ఎలక్ట్రిక్ బ్యాటరీలు తయారీ

నిమ్మకాయలతో పచ్చడి పెట్టుకుంటాం.  జ్యూస్‌‌‌‌ చేసుకొని తాగుతాం. కొన్ని రకాల ఫుడ్‌‌‌‌ ఐటమ్స్​లో  టేస్ట్ కోసం నిమ్మరసం కలుపుతాం. కానీ, ఈయన అలా కాదు. నిమ్మకాయలతో కరెంటు బ్యాటరీలు తయారుచేశాడు. ఆ బ్యాటరీలతో కారు బ్యాటరీని ఛార్జ్​ చేశాడు కూడా. పర్యావరణాన్ని పొల్యూట్​ చేయకూడదనే అతని ఆలోచనకి గిన్నిస్​ బుక్​ ఆఫ్​ వరల్డ్ రికార్డులో చోటు దక్కింది. ఇతనొక సైంటిస్ట్​.  పేరు  షైపుల్​ ఇస్లాం.

షైఫుల్‌‌‌‌ ఇస్లాం.. లండన్​లోని రాయల్‌‌‌‌ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ అనే ఆర్గనైజేషన్​లో సైంటిస్ట్. 2,923 నిమ్మకాయలతో  బ్యాటరీ ఎక్స్‌‌‌‌పరిమెంట్‌‌‌‌ చేసి, 2,307 వోల్ట్స్‌‌‌‌ల కరెంట్‌‌‌‌ను తయారుచేశాడు.  అందుకే అతని పేరు గిన్నిస్‌‌‌‌ బుక్‌‌‌‌ ఆఫ్ వరల్ట్‌‌‌‌ రికార్డ్స్​లోకి ఎక్కింది. ఈ ఎక్స్​పరిమెంట్​ని 2017 లోనే మొదటిసారి చేశాడు షైపుల్​. వెయ్యి నిమ్మకాయలను ముక్కలుగా చేసి, వాటి ద్వారా 1,274 వోల్ట్స్‌‌‌‌ల ఎలక్ట్రిసిటీని తయారు చేసి గిన్నిస్‌‌‌‌  రికార్ట్‌‌‌‌ సాధించాడు.  ఈసారి2,923 నిమ్మకాయలతో  2,307 వోల్ట్స్‌‌‌‌ ఎలక్ట్రిసిటీ తయారు చేశాడు. పండ్ల నుంచి ఎక్కువ వోల్టేజ్​ కరెంట్ తయారు చేసి, రికార్డ్‌‌‌‌ క్రియేట్‌‌‌‌ చేశాడు.  ఆ  కరెంట్​తోనే గో‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-–కార్ట్‌‌‌‌ రేస్‌‌‌‌ కార్‌‌‌‌‌‌‌‌ బ్యాటరీని ఛార్జ్​​ చేశాడు. అంతేకాదు కారును స్టార్ట్ చేసి నడిపించాడు కూడా.  

ఎక్స్‌‌‌‌పరిమెంట్‌‌‌‌ ఇలా

నిమ్మకాయలకు ఒకపక్క జింక్‌‌‌‌ ప్లేట్‌‌‌‌, మరోపక్క కాపర్‌‌‌‌‌‌‌‌ ప్లేట్‌‌‌‌ను గుచ్చాడు.  నిమ్మకాయల్లో ఉండే సిట్రిక్‌‌‌‌ యాసిడ్‌‌‌‌ జింక్‌‌‌‌తో కలిసి ఎలక్ట్రోడ్స్‌‌‌‌ను ప్రొడ్యూస్‌‌‌‌ చేస్తుంది. ఆ ఎలక్ట్రోడ్స్​ జింక్‌‌‌‌ ప్లేట్‌‌‌‌లో నుంచి వెళ్లి కాపర్‌‌‌‌‌‌‌‌ ప్లేట్​తో కలిసి కరెంట్‌‌‌‌ను ప్రొడ్యూస్​ చేస్తాయి.  ప్లస్‌‌‌‌, మైనస్‌‌‌‌ ఎలక్ట్రోడ్స్​ని వేరు చేసి వాటికి వైర్లను జాయింట్ చేశాడు.  ఆ వైర్ల నుండి వచ్చే కరెంట్‌‌‌‌తో గో–కార్ట్​ కారు బ్యాటరీకి ఛార్జింగ్​ పెట్టాడు.  

వేస్ట్​ చేయం

‘‘కరెంట్​ తయారీ కోసం వాడిన నిమ్మ కాయలను వేస్ట్​ చేయం. విడ్నెస్‌‌‌‌ సిటీలో వీటిని ప్రాసెస్​ చేసి ఆ వేస్టేజ్‌‌‌‌ నుండి రెన్యూవబుల్ ఎనర్జీని, బయోగ్యాస్‌‌‌‌ను తయారు చేస్తాం. మిగిలిన చెత్తను పంటలకు ఫెర్టిలైజర్‌‌‌‌‌‌‌‌గా, కంపోస్ట్‌‌‌‌గా  వాడుతాం’’ అని చెప్పాడు ఈ సైంటిస్ట్​.