V6 News

స్ప్రింటర్ షణ్ముగ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై నాలుగేండ్ల నిషేధం.. క్వార్టర్ మైలర్ విస్మయపై రెండేండ్ల బ్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

స్ప్రింటర్ షణ్ముగ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై నాలుగేండ్ల నిషేధం.. క్వార్టర్ మైలర్ విస్మయపై రెండేండ్ల బ్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: ఇండియా స్ర్పింటర్, ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన షణ్ముగ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  నాలుగేండ్ల పాటు నిషేధానికి గురయ్యాడు. క్వార్టర్ మైలర్ వి.కె. విస్మయపై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా)..  క్రమశిక్షణా ప్యానెల్ (ఏడీడీపీ) రెండేండ్ల సస్పెన్షన్ విధించింది. శ్రీనివాస్ డోప్ పరీక్షలకు సహకరించకుండా తప్పించుకున్నాడనే ఆరోపణలతో అతనిపై కఠిన చర్యలు తీసుకుంది. అతనిపై బ్యాన్ 2025 ఫిబ్రవరి 6వ తేదీ నుంచే అమల్లో ఉంటుందని తెలిపింది.

హైదరాబాద్​లోని గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  డోప్ పరీక్షల నుంచి తప్పించుకోవడానికి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మాజీ కోచ్ నాగపురి రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సహకరించినట్లు గతంలో ఆరోపణలు వచ్చాయి. అయితే, రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఉన్న తాత్కాలిక సస్పెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అప్పీల్ ప్యానెల్ గత నెలలో ఎత్తివేసింది. మరోవైపు 2018 ఆసియా గేమ్స్  4x400 మీటర్ల రిలేలో గోల్డ్ గెలిచిన ఇండియా టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెంబర్ అయిన విస్మయ డోపీగా తేలింది. 2024లో సేకరించిన ఆమె శాంపిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో క్లోమిఫేన్ అనే నిషేధిత ఉత్ప్రేరకం ఉన్నట్లు  గుర్తించారు.  2024  అక్టోబర్ 29 నుంచి బ్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమల్లోకి వచ్చినట్లు ఏడీడీపీ పేర్కొంది.