ఒక్కరోజే ఏడు ఫస్ట్ లుక్ పోస్టర్లు.. టాలీవుడ్ ను ఏలేస్తున్న యంగ్ బ్యూటీ

ఒక్కరోజే ఏడు ఫస్ట్ లుక్ పోస్టర్లు.. టాలీవుడ్ ను ఏలేస్తున్న యంగ్ బ్యూటీ

శ్రీలీల(Sreeleela).. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ఈ బ్యూటీ పేరే వినిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలు చేస్తున్న ప్రతీ సినిమాలో శ్రీలీలనే హీరోయిన్. దాదాపు ఆమె చేతిలో 10 సినిమాల వరకు ఉన్నాయి. ఆ లిస్టులో.. పవన్ కళ్యాణ్(Pawan kalyan), మహేష్ బాబు(Mahesh babu), ప్రభాస్(Prabhas), నితిన్(Nithin), రామ్ పోతినేని(Ram Pothineni), విజయ్ దేవరకొండ(Vijay devarakonda), వైష్ణవ్ తేజ్(Vaishnav tej), బాలకృష్ణ(Balakrishna) వంటి స్టార్ హీరోలు ఉన్నారు. 

ఇక జూన్ 14 శ్రీలీల పుట్టున రోజు కావడంతో ఆమె నటిస్తున్న సినిమాల నుండి శ్రీలీలకు విషెష్ తెలుపుతూ ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో మొదటగా మహేష్ బాబు హీరోగా వస్తున్న గుంటూరు కారం(Guntur kaarnam) నుండి వచ్చింది. ఈ సినిమాకు త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వం వహిస్తున్నారు. తరువాత పవన్ కళ్యాణ్ హీరోగా డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్(Harish shankar) తెరకెక్కిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagathsingh) నుండి వచ్చింది. ఆతరువాత.. రామ్ పోతినేని హీరోగా.. మాస్ డైరెక్టర్ బోయపాటి(Boyapati) తెరకెక్కిస్తున్న సినిమా నుండి కూడా ఒక పిక్ రిలీజయింది. అలాగే నితిన్ హీరోగా, వక్కంతం వంశీ(Vakkantham Vamshi) తెరకెక్కిస్తున్న సినిమా నుండి కూడా శ్రీలీల ఫస్ట్ లుక్ వచ్చింది. ఇక మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న ఆదికేశవ(Adhikeshava) సినిమా నుండి శ్రీలీల ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. అంతేకాదు.. నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా వస్తున్న భగవంత్ కేసరి(Bhavanth kesari) హీరోగా, అనిల్ రావిపూడి(Anil ravipudi) తెరకెక్కిస్తున్న సినిమా నుండి కూడా శ్రీలీల ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. 

ఇక ఒక పుట్టిన రోజున ఇన్ని సినిమాల నుండి ఫస్ట్ లుక్స్ రిలీజైన ఫస్ట్ హీరోయిన్గా శ్రీలీల రికార్డ్ క్రియేట్ చేసింది. ఇవి చూసిన నెటిజన్స్ శ్రీలీలకు విషెష్  తెలుపుతూ.. టాలీవుడ్ ను ఏలేస్తున్నావ్ శ్రీలీల అంటూ కామెంట్స్ పెడుతున్నారు.