టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల (Sreeleela) క్రేజీ కామెంట్స్ చేశారు. లేటెస్ట్గా చెన్నైలో జరిగిన అమృత ఏవియేషన్ కాలేజ్ ప్రెస్ ఈవెంట్‌లో శ్రీలీల పాల్గొని విద్యార్థులతో సందడి చేశారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్ శ్రీలీలను “లేడీ సూపర్ స్టార్” అనే ట్యాగ్‌తో పిలవగా, అంతటి బిరుదుకు అసలైన అర్హురాలు నయనతారేనని చెప్పి తనశైలిని చాటుకుంది. ఈ క్రమంలోనే నయనతార తనకు రోల్ మోడల్ అని, ఆ స్థాయికి చేరుకోవడానికి ఇంకా చాలా సమయం పడుతుందని తెలిపింది.
ఈ సందర్భంగా చెన్నైనగరంపై తన అభిమానాన్ని కూడా వ్యక్తం చేసింది. చెన్నై దోశలు ఎంతో ఇష్టమని, ఇక్కడి కుర్రాళ్లు చాలా స్వీట్ అని సరదాగా చెప్పి స్టూడెంట్స్ లో క్యూరియాసిటీ పెంచింది. ఇక భవిష్యత్తులో నయనతారలాగే చెన్నైలో తన పెళ్లి జరుగుతుందో లేదో తెలియదంటూ నవ్వులు పూయించింది.
ప్రస్తుతం శ్రీలీల చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చెన్నై కుర్రాళ్లు చాలా స్వీట్ అని, భవిష్యత్తులో చెన్నైలో పెళ్లి జరుగుతుందో లేదో తెలియదంటూ ఆమె చేసిన సరదా కామెంట్స్ నెట్టింట చర్చకు దారితీశాయి. దీంతో “శ్రీలీల తమిళనాడుకు కోడలిగా వెళ్లనున్నారా?”, “చెన్నై కుర్రాడితో ప్రేమలో పడ్డారా?” అంటూ నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు.
நான் Lady Superstar-ஆ🤫 | Cm Vijay | Actress Sreeleela at Chennais Amirta Aviationhttps://t.co/cZ4Cjco0N1#Fridayfacts #sreeleela #cmvijay #nayanthara #chennaisamirta pic.twitter.com/CV0Lf2OG97
— Friday Facts (@fridayfacts_) May 11, 2026
సక్సెస్ గమ్యం కాదు, అది ఒక ప్రయాణం..
ఈ క్రమంలోనే స్టూడెంట్స్కి శ్రీలీల మోటివేషన్ చేసింది. “సక్సెస్ అనేది గమ్యం కాదు, అది ఒక ప్రయాణం” అని పేర్కొన్నారు. జీవితంలో ఓటమిని భయపడొద్దని, ఫెయిల్యూర్ ద్వారా నేర్చుకున్న పాఠాలే సక్సెస్కి దారి చూపుతాయని విద్యార్థులకు సూచించింది.
అలాగే చదువులో ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ముఖ్యమని, ముఖ్యంగా ఏవియేషన్ విద్యార్థులు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని తెలిపారు. సినిమా రంగంలో అయినా, వ్యక్తిగత జీవితంలో అయినా ఒడిదొడుకులు సహజమని, వాటిని అధిగమించి ముందుకు సాగడమే జీవితమని శ్రీలీల తెలిపింది. ఇకపోతే, అమృత ఏవియేషన్ సంస్థకు శ్రీలీల బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
బై వన్ గెట్ వన్ ఫ్రీ లాంటి బంధం:
ఇక తన తల్లితో ఉన్న అనుబంధంపై కూడా శ్రీలీల హృదయపూర్వకంగా మాట్లాడారు. “నేను ఎక్కడికి వెళ్లినా మా అమ్మ నా వెంటే ఉంటుంది. మా ఇద్దరిది ‘బై వన్ గెట్ వన్ ఫ్రీ’ లాంటి బంధం” అంటూ ఎమోషనల్ అయింది. ప్రస్తుతం ప్రేక్షకులను గర్వపడేలా చేసే మంచి పాత్రల్లో నటించడమే తన లక్ష్యమని శ్రీలీల వెల్లడించారు.
ఇదిలా ఉంటే.. బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్తో కొంతకాలంగా శ్రీలీల డేటింగ్లో ఉన్నట్లు టాక్ నడుస్తోంది. ఈ వార్తలపై కార్తీక్, శ్రీలీల ఇద్దరూ ఇప్పటి వరకు నోరెత్తలేదు. అలా అని ఎక్కడా ఖండించలేదు. కార్తీక్ ఆర్యన్ తో అనురాగ్ బసు దర్శకత్వంలో ఆషికి 3 మూవీలో నటిస్తుంది. అక్కడే వీళ్లిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది అనేది సినీ ఇండస్ట్రీ టాక్. రొమాంటిక్ డ్రామాగా వస్తున్న ఈ మూవీ 2026 అక్టోబర్ 16న విడుదల కానుందని టాక్.
