బ్రహ్మచారిణి దేవిగా జోగులాంబ

బ్రహ్మచారిణి దేవిగా జోగులాంబ

అలంపూర్, వెలుగు: అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదో శక్తిపీఠంగా విరాజిల్లుతున్న శ్రీ జోగులాంబ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సోమవారం రెండో రోజు జోగులాంబ అమ్మవారు బ్రహ్మచారిణి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. సహస్రనామార్చన, చండీ హోమం నిర్వహించారు.  

సాయంత్రం దర్బార్  సేవలో భాగంగా అమ్మవారికి నవదుర్గ అలంకారంలో కొలువు పూజ, కుమారి పూజ, సువాసిని పూజలు చేసి మహా మంగళహారతి ఇచ్చారు. ఉత్సవాల్లో భాగంగా వందన డాన్స్  అకాడమీ తాడిపత్రి వారి కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది. ఈవో పురేందర్ కుమార్, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. -