శ్రీలంక టూరిజం శాఖ... డెస్టినేషన్ వెడ్డింగ్  రోడ్ షో

శ్రీలంక టూరిజం శాఖ... డెస్టినేషన్ వెడ్డింగ్  రోడ్ షో

హైదరాబాద్​, వెలుగు: తమ దేశంలో  డెస్టినేషన్​ వెడ్డింగ్​ గురించి తెలియజేయడానికి శ్రీలంక టూరిజం ప్రమోషన్​ బోర్డు హైదరాబాద్​లో రోడ్​షో నిర్వహించింది. భారతీయ వివాహాలకు శ్రీలంక అత్యంత అనువుగా ఉంటుందని ప్రకటించింది.

అందమైన సముద్ర తీరాలు, చారిత్రక ప్రదేశాలు, పర్వత ప్రాంతాలు వివాహాలకు అద్భుతమైన వాతావరణాన్ని అందిస్తాయని  బోర్డ్​ చైర్మన్​ బుద్ధిక హేమవాసమ్​తెలిపారు. పెళ్లితో పాటు సెలవులను కూడా ఆస్వాదించవచ్చన్నారు.